లెజెండ్ అంటూ టీషర్టుపై రాసుకొని బుల్లెట్ నడుపుతూ ముందు ఒకరు. వెనకాల బోలెడన్ని లగ్జరీ కార్లతో కూడిన ఓ పెద్ద కాన్వాయ్. సూటూ బూటూ ధరించి మొదటి కారులోనే రాజసం ఉట్టిపడేలా కూర్చున్న బాలయ్య. చుట్టూ అభిమానులకి అభివాదం చేస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగిపోయాడు బాలయ్య. ఇదంతా మన అనంతపురంలోనో - అమలాపురంలోనో అనుకొంటే పొరపాటు. మన దేశం కాని దేశమైన అమెరికాలో. ప్రస్తుతం బాలయ్య అమెరికాలో పర్యటిస్తున్నాడు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం ఫండ్స్ సేకరించేందుకు బాలయ్య అక్కడికి వెళ్లాడు. హాస్పిటల్ కి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ పేద రోగులకి మరింత సహాయం చేయాలన్న లక్ష్యంతో మరింత చొరవ తీసుకొని ఫండ్స్ సేకరించడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు బాలయ్య. అందులో భాగంగానే ఇటీవల అమెరికా వెళ్లారు.
బాలయ్య వచ్చాడని తెలియగానే అక్కడి సీటెల్ విమానాశ్రయంకు పెద్దయెత్తున చేరుకొన్న అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అది రాయల్ వెల్ కం అని చెప్పొచ్చు. ఎయిర్ పోర్టు నుంచి బాలయ్య బస చేయనున్న హోటల్ వరకు పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి కూడా అమెరికాలో అభిమానులు ఈ రేంజిలో స్వాగతం పలకలేదని...అంటున్నారు. బాలయ్య కూడా ఆద్యంతం ఉత్సాహంగా ఉల్లాసంగా అభిమానులతో మాట్లాడుతూ గడుపుతున్నట్టు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం ప్రత్యేకమైన గెటప్ లో ఉన్నారు బాలకృష్ణ. ఆ గెటప్ లోనే అమెరికాలో పర్యటిస్తున్నారు. దీంతో అభిమానులు ఆ సినిమా విశేషాల్ని ఆసక్తికరంగా అడిగి తెలుసుకొంటున్నారు.