ఉత్తమ సింగర్లు అంతా హైదరాబాద్ లోనే!
అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వాళ్లతో భేటీలు సైతం నిర్వహిస్తున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బోజ్ పురీ, మరాఠీ ఇలా ఎన్నో చిత్ర పరిశ్రమలో దేశంలో కొలువు దీరాయి. 50-60 ఏళ్లగా భారతీయ సినీ ప్రేక్షకులకు ఆయా పరిశ్రమలు వినోదాన్ని అందిస్తున్నాయి. సినిమాలో 24 శాఖలు సమన్వయం అవ్వడంతోనే అంత గొప్ప ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. దేశాన్ని వృద్ధి బాటలో నడిపించడంలో ఎంటర్ టైన్ మెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సెలబ్రిటీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వాళ్లతో భేటీలు సైతం నిర్వహిస్తున్నారు.
భారతీయ సినిమా అంటే ప్రపంచలోనే ఎంతో ప్రఖ్యాతగాంచిందిగా ఎదిగింది. అందులోనూ ఇటీవల ఉపేంద్ర చెప్పినట్లు టాలీవుడ్ వరల్డ్ నే షేక్ చేస్తోంది. ఆస్కార్ గుర్తింపుతో దేశం మీసం మెలేసింది. మరి అలాంటి దేశంలో హైదరాబాద్ సింగర్ల స్థానం ఏంటి? అంటే ఇండియాలోనే ఉత్తమ సింగర్లు అంతా హైదరాబాద్ లోనే ఉన్నారని అంటున్నారు థమన్. వాళ్ల ప్రతిభను సరిగ్గా వాడుకో గలిగితే అద్బుతాలు సృష్టించ వచ్చు అన్నారు. గాయకుల కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పనిలేదన్నారు.
అన్ని రకాల పాటలు పాడే సత్తా తెలుగు వారికి....ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సింగర్లకు ఉందని ధీమా వ్యక్తం చేసారు. ప్రతిభ ఉన్నా? చాలా మందికి సరైన అవకాశాలు రావడం లేదన్నారు. ఇది అక్షరాలా నిజం. తెలుగు గాయనీ, గాయకులకు సరైన అవకాశాలు రావడం లేదన్నది వాస్తవం. సొంతింటి ప్రతిభ కంటే పక్కింటి పుల్ల కురకే రుచెక్కు వని చెన్నై, ముంబై అంటూ పరుగులు తీస్తున్నారు. అలాగే తెలుగు సంగీత దర్శకులు కంటే? ఇతర భాషల సంగీత దర్శకులకు ఎక్కువగా అవకాశాలు దక్కతుతున్నాయి.
ఈ విధానంలో కొంచమైనా మార్పు రావాలని భావిస్తున్నారు. ప్రతిభావంతులైనా తెలుగు వారికి అకాశాలు కల్పించా లని నవతరం సంగీత దర్శకులు కోరుతున్నారు. అవకాశం వస్తే నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలం క్రితం బాలీవుడ్ నటులంటూ టాలీవుడ్ ఇలాగే పరుగులు పెట్టింది. ఇప్పుడా ప్రభావం కాస్త తగ్గింది. ఇంకా టాలీవుడ్ లో మరిన్ని మార్పులు అవసరమంటున్నారు.