తొలి హిట్‌ నటసింహమే ఇవ్వాలి

Update: 2015-05-23 17:30 GMT
ఈరోస్‌ ఇంటర్నేషనల్‌.. ఓ ప్రముఖ బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ.. అయితే తెలుగులో ఎన్నో సినిమాలు కొనుకున్నారు. 1-నేనొక్కడినే, ఆగడు, కొచ్చాడయాన్‌, లింగా, ఉత్తమ విలన్‌.. వంటి సినిమాలన్నీ ఈరోస్‌ వారివే. వీరికి ఇప్పుడు రెండు అవసరాలు ఉన్నాయి. ఒకటి తెలుగులో ఇంతవరకు వీళ్ళు పూర్తిగా ప్రొడ్యూస్‌ చేసిన సినిమా ఏదీ లేకపోవడం. రెండోది వీళ్లకు ఇంతవరకు సూపర్‌హిట్టు అనేది పడకపోవడం. ఈ రెండూ నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు నందమూరి నటసింహం మీదనే ఉంది.

ఈరోస్‌ సంస్థ మొన్నటివరకు ఇక్కడి లోకల్‌ ప్రొడ్యూసర్లు దాదాపు సినిమా అంతే తీసేశాక తరువాత దానిని కొనేశారు. ఇంతవరకు సౌత్‌లో వీళ్ళ భాగస్వామ్యం తీసుకున్న ప్రాజెక్టులన్నీ ఇంతే. అయితే ఇప్పుడు తొలిసారిగా బాలయ్యతో ''డిక్టేటర్‌'' మాత్రం డైరక్టుగా వారే ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ప్రతీ సీన్‌ దగ్గర నుండి రైటర్లు వాడే పెన్నుల వరకు అన్నీ ఈరోస్‌ చూసుకుంటంది. మరి ఈ సినిమాను శ్రీవాస్‌ ఎలా తీస్తాడో, బాలయ్యతో కలసి ఈరోస్‌ వారికి సౌత్‌లో తొలి ప్రొడక్షన్‌ ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలేలా చేస్తూ వారికి తొలిసారి ఓ హిట్టును కూడా ఇవ్వాలని ఆశిద్దాం. బాలయ్య.. ఓవర్‌ టు యు!!
Tags:    

Similar News