మతం మారాలని కండీషన్.. అందుకే స్టార్ హీరో పెళ్లి కాలేదా?
అయితే సల్మాన్ కి పెళ్లి కాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే.. ఈ ప్రశ్నకు అతడి తండ్రి, ప్రముఖ రచయిత సలీంఖాన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు.
బాలీవుడ్ అగ్ర హీరోగా దశాబ్ధాల పాటు ఏల్తున్నాడు సల్మాన్ ఖాన్. హీరోగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా అతడు సాధించనిది లేదు. దాదాపు రూ.2900 కోట్ల నికర ఆస్తులతో భారతదేశంలోని టాప్- 5 ధనిక హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అయితే ఆస్తి ఐశ్వర్యం అతడి సమస్య కాదు. 59 వయసులోను తనకంటూ ఒక తోడు లేక ఒంటరిగా ఉన్నాడనేదే అభిమానుల ఆందోళన. జీవితంలో మూడు సార్లు ప్రేమలో విఫలమయ్యాడు. ప్రతిసారీ అతడి పెళ్లికి ఏదో ఒక అడ్డంకి వస్తోంది. ఆ అడ్డంకి ఏమిటో అర్థం గాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు.
అయితే సల్మాన్ కి పెళ్లి కాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే.. ఈ ప్రశ్నకు అతడి తండ్రి, ప్రముఖ రచయిత సలీంఖాన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు మరోసారి నెట్ లో వైరల్ గా మారుతోంది. సల్మాన్ ఖాన్ తనకు కాబోయే భార్య కెరీర్‌ను వదులుకోవాలని, ఇంట్లోనే ఉండాలని కోరుకున్నాడని సలీం ఖాన్ అన్నారు. అతడి ఆలోచనలో ఒక వైరుధ్యం ఉంది. అతడు వివాహం చేసుకోకపోవడానికి ఇది ఒక కారణం అని సలీం ఖాన్ అన్నారు.
సల్మాన్ ఎక్కువగా తాను పనిచేసే హీరోయిన్ల వైపు ఆకర్షితుడవుతాడు ఎందుకంటే వారు దగ్గరగా పనిచేసేవారు. అందంగా కనిపించే యువతులు. ఒక నటితో సంబంధంలోకి వచ్చిన తర్వాత ఆ మహిళలో తన తల్లి లక్షణాలను వెతకడానికి ప్రయత్నిస్తాడు అని సలీంఖాన్ పేర్కొన్నాడు. కెరీర్ ఆధారిత మహిళ తన ఆశయాలను వదులుకుని ఇంటి పనికే సరిపోతుందని సల్మాన్ ఆశించడం తప్పు అని సలీం ఖాన్ అన్నారు. ప్రేమించిన యువతిని ఎందుకు దూరం చేసుకోవాలి? అని కూడా సలీం ఖాన్ ప్రశ్నించారు.
ఇది ఒక్కటే కాదు.. కమిట్మెంట్ తర్వాత వారి మతం మార్చడానికి సల్మాన్ ప్రయత్నిస్తాడు. వారిలో తన తల్లి కోసం చూస్తాడు.. అది సాధ్యం కాదు! అని ఆయన అన్నారు. పని చేస్తున్న నటి పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం, వారి హోంవర్క్‌లో సహాయం చేయడం లేదా వారి భోజనం తయారు చేయడం వంటి రోజువారీ కార్యకలాపాలు చేయలేరని సలీం అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలలో వైరల్ గా షికార్ చేస్తోంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ వయసు 59. షష్ఠిపూర్తికి చేరువయ్యాడు. అందువల్ల ఇప్పుడు అతడు పెళ్లి ఊసెత్తడం లేదు. సోమీ అలీ, సంగీతా బిజిలానీ, ఐశ్వర్యారాయ్, కత్రిన కైఫ్ వంటి కథానాయికలతో సల్మాన్ సుదీర్ఘ కాలం ప్రేమాయణాలు సాగించాడు. వారిలో ఎవరో ఒకరిని పెళ్లాడాలని ప్రయత్నించాడు. కానీ అవేవీ సఫలం కాలేదు. బహుశా సలీంఖాన్ చెప్పిన కారణాల వల్లనే ఈ పెళ్లి ప్రయత్నాలు విఫలమయ్యాయని అర్థం చేసుకోవాలి. సల్మాన్ ఖాన్ త్వరలో సికందర్‌లో కనిపిస్తాడు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈద్ 2025 కానుకగా విడుదల కానుంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.