ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ టిడిపిని మొదటిసారి అధికారంలోకి తీసుకువచ్చినప్పుడు జరిగే సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇందులో బాలయ్యతో పాటు రానా మరికొందరు కీలకమైన ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఇకపోతే బయోపిక్ గా ప్రచారం చేస్తున్నారు కనక ఇందులో ఆయన జీవితానికి సంబంధించిన కీలకమైన అన్ని ఘట్టాలు చూపిస్తారా అనే అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు నేల రాజకీయ చరిత్రలో అత్యంత కీలకంగా చెప్పుకునే బాబు వెన్నుపోటు ఎపిసోడ్ ఇందులో పొందుపరుస్తారా లేదా అనే డౌట్ కు ఇంకా తెరవీడలేదు. ఇప్పుడున్న ఎన్నికల వాతావరణంలో అది నిజమైనా సినిమాలో చూపిస్తే ఇమేజ్ పరంగా దెబ్బ పడొచ్చు కాబట్టి బాలయ్య తన వియ్యంకుడికి ఇబ్బంది కలిగించే ఆ సన్నివేశాలు ఉంచకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
కానీ ఎన్టీఆర్ జీవితాన్ని పరిపూర్ణంగా తెర మీద ఆవిష్కరించాలి అంటే ఇవన్నీ చూపించాల్సిందే. అప్పుడే కథకు న్యాయం చేసినట్టు అవుతుంది. అప్పుడు ఏం జరిగింది అనే దానికి సంబంధించిన ఆధారాలు పేపర్ కటింగ్స్ ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. సో మభ్య పెట్టడానికి లేదు. ఆ సమయంలో జరిగిన వాటిని ఉటంకిస్తూ ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు రాసిన పుస్తకంలో చాలా వివరాలు ఉన్నాయి. కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ ని ఎలా ముగిస్తారు అనేదాని మీద పెద్ద చర్చే సాగుతోంది. క్లైమాక్స్ కు సంబంధించి గతంలో కొన్ని లీక్స్ వచ్చాయి కానీ నిర్ధారణగా ఎవరూ చెప్పడం లేదు. రానా చేస్తున్నాడు కాబట్టి నెగటివ్ గా అనిపించే ఏ అంశం ఉన్నా తాను కూడా ఒప్పుకోడు. సో వెన్నుపోటు ఉండే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఒకవేళ ప్రస్తావిస్తే మాత్రం నిజాయితీ ఉందని ఒప్పుకోవచ్చు. చూద్దాం.