బాల‌య్య - బోయ‌పాటి మ‌ళ్లీ యూట‌ర్న్

Update: 2020-01-13 07:44 GMT
బాలయ్య‌కు జాగ్ర‌త్త ఎక్కువైందా?  అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస ప్లాప్ ల నేప‌థ్యంలో బోయ‌పాటి శ్రీను తో చేయ‌బోయే కొత్త సినిమా  విష‌యంలో మ‌రింత కేర్ తీసుకుంటున్నారట‌. స్క్రిప్ట్  స‌హా బ‌డ్జెట్ విష‌యాల్లోనూ అంతే ఆచితూచి ఆలోచిస్తున్నారు. హ్యాట్రిక్ కాంబినేష‌న్ లో...బొమ్మ బ్లాక్ స్ట‌ర్ అవ్వాల్సిందే అన్న ప‌ట్టుద‌ల క‌నిపిస్తోంది.  ఈసారి బాల‌య్య‌- బోయ‌పాటి ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్తున్నారు. స‌హ‌జంగా బాల‌య్య ద‌ర్శ‌కుల హీరో. కానీ ఇప్పుడు వాళ్ల‌ని అంత గుడ్డిగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. స్క్రిప్ట్ విష‌యంలో ఒక‌టికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని ముందుకెళ్లాల్సిన స‌న్నివేశం ఉంది.

ఇప్ప‌టికే అన్నిర‌కాలా బాల‌య్య అలెర్ట‌యిపోయారు. తాజాగా టెక్నిక‌ల్ టీమ్ పై బాల‌య్య దృష్టి  సారించిన‌ట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రాఫ‌ర్ గా సీనియ‌ర్ టెక్నిషీయ‌న్ రామ్ ప్ర‌సాద్ ని ఆల్రెడీ ఎంపిక చేసారు. గ‌తంలో బాల‌య్య సినిమాల‌కు ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. బాల‌య్య‌- బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కిన లెజెండ్ సినిమాకు ఆయ‌నే ఛాయాగ్ర‌హ‌కుడు. ఇటీవ‌లే విడుద‌లైన రూల‌ర్ కు  ప‌నిచేసారు. అయితే బోయపాటి సినిమాకు మాత్రం  రామ్ ప్ర‌సాద్  స్థానంలో కొత్త సినిమాటోగ్రాఫ‌ర్ ని తీసుకోవాల‌ని భావిస్తున్నారుట‌. మ‌రి ఈ మార్పు ఎందుకు అన్న‌ది తెలియాల్సి ఉంది. రామ్ ప్ర‌సాద్ సీనియ‌ర్ మోస్ట్ టెక్నీషియ‌న్ అయినా ఎందుకీ మార్పు అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎన్‌.బీ.కే 106 చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ కు తీసుకెళ్లాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. సింహ‌- లెజెండ్ చిత్రాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బాల‌య్య శైలి మాసిజం.. యాక్ష‌న్ .. ఫ్యామిలీ సెంటిమెంట్  క‌చ్చితంగా  ఉంటాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది.  అయితే బోయ‌పాటి ఎంపిక చేసుకున్న కంటెంట్ పై స‌రైన క్లారిటీ లేదు. త‌న‌దైన శైలి చూపిస్తూనే కొత్త‌ద‌నం ఏం చూపిస్తాడు? బాల‌య్య ను మునుప‌టి కంటే కొత్త గా చూపిస్తాడా లేదా? అన్న‌ది కొద్ది రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. రూల‌ర్ విష‌యంలో జ‌రిగిన త‌ప్పిదాల్ని భేరీజు వేసుకుని అవి రిపీట్ కాకుండా బోయ‌పాటి వ‌ర్క‌వుట్ చేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News