టాలీవుడ్ టాప్ సెలబ్రెటీ బండ్ల గణేష్ అనూహ్యంగా ఈడీ కార్యాలయంలో కనిపించడంతో అంతా కూడా షాక్ అయ్యారు. డ్రగ్స్ కేసులో బండ్ల గణేష్ కు నోటీసులు అందినట్లున్నాయి. దాంతో ఆయన విచారణకు హాజరు అయ్యాడు అంటూ మీడియాలో గుప్పుమనడంతో అంతా కూడా అవాక్కయ్యారు. బండ్ల గణేష్ గతంలో కేసులు విచారణ లు చాలానే ఎదుర్కొన్నాడు. కనుక ఇది కూడా నిజమేనేమో అనుకున్నారు. మీడియా పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ ముందుకు వెళ్లింది. అక్కడ బండ్ల గణేష్ ను మాట్లాడించే ప్రయత్నం చేసింది. మీకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయా.. మీరు ఎందుకు విచారణకు హాజరు అయ్యారు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా సరఫరా చేశారా అంటూ చాలా చాలా ప్రశ్నలు బండ్లను అడిగారు.
బండ్ల గణేష్ అన్నింటికి కలిపి ఒకే ఒక్క సమాధానం ఇచ్చాడు. అదే నాకు కనీసం వక్కపొడి తినే అలవాటు కూడా లేదు. నేను డ్రగ్స్ కేసులో ఎలా ఉంటాను. నాకు డ్రగ్స్ తో సంబంధం లేదు. నాకు అసలు ఎలాంటి నోటీసులు రాలేదు. అమ్మతోడు నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పేశాడు. నాకు చాలా ఆప్తమిత్రుడు అయిన పూరి జగన్నాద్ గారికి మోరల్ సపోర్ట్ ఇవ్వడం కోసం వచ్చాను అన్నాడు. పూరి గారి వెంట ఆయన కోసం వచ్చానే తప్ప తనకు ఎలాంటి నోటీసులు రాలేదు అంటూ అమ్మ మీద ఒట్టేసి బండ్ల గణేష్ చెబుతున్నా కూడా ఎక్కడో తేడా కొడుతుంది అంటూ కొందరు సోషల్ మీడియాలో బండ్లను ట్యాగ్ చేస్తూ డ్రగ్స్ కేసును ఆయనకు బనాయించే ప్రయత్నాలు చేస్తున్నారు.
బండ్ల గణేష్ కొన్ని ఆర్థిక పరమైన కేసులను ఎదుర్కొన్న విషయమై. కొన్ని సార్లు చీటింగ్ కేసులను కూడా ఎదుర్కొన్నాడు. కాని గతంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ కేసుతో ఈయనకు సంబంధం ఉన్నట్లుగా కనీసం వార్తలు కూడా రాలేదు. ఆయన ఎప్పుడు కూడా పోలీసులకు ఆ కేసు విషయంలో అనుమానితుడిగా కూడా లేడు. కనుక ఇప్పుడు ఆయన చెబుతున్నది నిజమే అయ్యి ఉంటుంది. ఆయన కేవలం తన సన్నిహితుడు అయిన పూరి కోసం వెళ్లి ఉంటాడు. సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న బండ్ల గణేష్ నిర్మాతగా మరియు నటుడిగా కూడా బిజీ అవ్వాలనుకుంటున్నాడు. ఇదే సమయంలో తన కొడుకును హీరోగా చేయాలని ఆశ పడుతున్నాడట.