సాయి పల్లవి కళ్లలో ఏదో ఉంది: దేవీ శ్రీ ప్రసాద్
సాయి పల్లవి ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి పాత్రనైనా చేయగలదని, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నానని డీఎస్పీ చెప్పాడు.
సాయి పల్లవి ఎంత గొప్ప నటి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె గురించి, ఆమె నటన గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నోసార్లు గొప్పగా పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశాడు. సాయి పల్లవి గురించి ఏం చెప్పాలి అంటూ మొదలుపెట్టిన డీఎస్పీ ఆమె నటనను నెక్ట్స్ లెవెల్ లో ప్రశంసించాడు.
సాయి పల్లవి ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి పాత్రనైనా చేయగలదని, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆమెను గమనిస్తూనే ఉన్నానని డీఎస్పీ చెప్పాడు. ప్రతీ సినిమాకూ తన 100% ఇస్తుందని, నటీనటులెవరైనా సరే డైలాగ్ చెప్పేటప్పుడు వారిలోని యాక్టింగ్ లెవెల్స్ అన్నింటినీ బయట పెట్టి అద్భుతంగా ఆ సీన్స్ ను పండిస్తారు.
కానీ సాయి పల్లవి అసలెలాంటి డైలాగ్ లేకపోయినా, ఒక సజిషన్ షాట్ అయినా, క్లోజప్ షాట్ అయినా సరే హీరో కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే ఆమె చేసే నటన, ఆ సీన్ ను తన యాక్టింగ్ ఆమె ముగించే తీరు ఎంతో అద్భుతంగా ఉంటుందని, తన కళ్లల్లో ఏదో మత్తు ఉందని, అలాంటి యాక్టింగ్ చూసినప్పుడు ఎవరికైనా అద్భుతంగా మ్యూజిక్ ఇవ్వాలనిపిస్తుందని డీఎస్పీ వెల్లడించాడు.
ఇక తండేల్ సినిమా గురించి మాట్లాడుతూ, చైతూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని, ఈ కథ చాలా బాగా వచ్చిందని, సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారని, అందుకే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చిందని దేవీ శ్రీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపాడు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.