కరోనా లంగ్స్ దెబ్బతిన్నాయి.. ఒక్కరోజు ఆలస్యమైనా చనిపోయేవాడిని: బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే పూనకం వచ్చినట్టు ఊగిపోయే పరమ వీరభక్తుల్లో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఒకరు. పవన్ కళ్యాణ్ కు ఒక దేవుడిలా బండ్ల భావిస్తాడు. తాజాగా మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు. కేవలం పవన్ తో సినిమా చేసేందుకునే ఆయనతో క్లోజ్ గా ఉంటున్నారనే విమర్శలను తిప్పి కొట్టాడు బండ్ల గణేష్.
తాజాగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సినిమా తీసినా.. తీయకపోయినా పవన్ కళ్యాణ్ వెంట తిరుగుతానని.. పవన్ తో తిరగడానికి.. సినిమా తీయడానికి సంబంధం లేదని అన్నారు. దేవుడు వరమిచ్చినా ఇవ్వకపోయినా గుడికి వెళ్తామని.. నేను కూడా అంతేనన్నారు. పవన్ దగ్గరకు వెళుతుంటాను.. ఆయనతో సినిమా తీస్తానా? తీయనా అనేది తర్వాత విషయం అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.
ఇక రెండోసారి కరోనా సోకినప్పుడు ఎవ్వరూ తనను ఆదుకోలేకపోయారని.. చిరంజీవి చొరవతో తను ప్రాణాలతో బయటపడ్డానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. తన కరోనా కష్టాలు దారుణంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నాకు రెండోసారి కరోనా వచ్చినప్పుడు 80శాతం లంగ్స్ దెబ్బతిన్నాయని.. ఏ హాస్పిటల్ కు ఫోన్ చేసినా బెడ్స్ లేవన్నారని.. మా హీరో పవన్ సైతం కరోనా బారినపడ్డారని.. ఏం చేయాలో తెలియక చిరంజీవికి ఫోన్ చేశానని వెంటనే నాకు ఒక హాస్పిటల్ బెడ్ ను ఎరేంజ్ చేశాడని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు..
ఒక్కరోజు ఆలస్యం అయినా నేను చనిపోయేవాడినని డాక్టర్లు చెప్పారని.. ఈరోజు నేను బతికున్నానంటే చిరంజీవియే కారణం అని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి కుటుంబంలో అందరూ మంచోళ్లని.. తను ఎప్పుడూ వాళ్లకు మద్దతుదారుగా ఉంటానని ప్రకటించాడు బండ్ల గణేష్.