బిగ్ బాస్ దసరా రోజు ఎపిసోడ్ లో సమంత హోస్టింగ్ లో దివి ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఆమె ఎలిమినేషన్ చాలా మందికి షాకింగ్ గా ఉంది. ఆమె కంటే హౌస్ లో చాలా మంది వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కాని దివిని ఎలిమినేట్ చేయడం ఏంటీ అంటూ నెటిజన్స్ బిబి టీం ను ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన దివి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.
హౌస్ లోకి ఎలా అయితే వెళ్లానో అలాగే బయటకు వచ్చాను. ఎలిమినేట్ అయిన సమయంలో నేను ఏమీ ఎమోషనల్ అవ్వలేదు. అయితే దసరా రోజున బయటకు రావాల్సి వచ్చినందుకు బాధగా అనిపించింది. బయటకు వచ్చే సమయంలో నాకు ఏమీ బాధగా లేదు కాని చాలా మంది బయటకు వచ్చిన తర్వాత మీరు ఉండాల్సింది.. మీకోసం ఓట్లు వేశాం అంటూ ఉంటే ఇంకొన్నాళ్లు ఉంటే బాగుండేది కదా అనిపించింది.
ఇంట్లో అమ్మ రాజశేఖర్ మాస్టర్ తో తప్ప ఏ ఒక్కరితో నేను కనెక్ట్ అవ్వలేక పోయాను. అందరితో బాగానే మాట్లాడినా కూడా అమ్మ గారితో మాత్రమే నేను ఎక్కువగా ఉన్నాను. ఆయన నా విషయంలో చూపించిన కేరింగ్ మరియు స్నేహంను నేను నమ్మి ఆయనతో కనెక్ట్ అయ్యాను. అయితే ఆయనతో కనెక్ట్ అవ్వడం వల్ల నేను ఎప్పుడు కూడా గేమ్ విషయంలో డిస్ట్రబ్ అవ్వలేదు. అన్ని విషయాల్లో కూడా నేను నా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను. ఆయనతో ఉండటం వెనుక ఎలాంటి ఉద్దేశ్యమూ లేదు అంటూ దివి చెప్పుకొచ్చింది. ఆయన ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా నేను దాన్ని ఖండించేదాన్ని. ఎలిమినేట్ అయిన తర్వాత నేను టెలిఫోన్ లో ఇంటి సభ్యులతో మాట్లాడించారు. కాని అది ప్రసారం చేయలేదు.
అవినాష్ జోక్ గా మాట్లాడుతున్నట్లుగా అనిపించినా కూడా కొన్ని సార్లు అతడి మాటలు మనసుకు బాధను కలిగిస్తాయి. ఇక అభిజిత్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా నన్ను జనాలు సేవ్ చేస్తారు అని ఆయన నమ్ముతూ ఉంటాడు. ఇక లాస్య గారిని పప్పు సాకు చూపించి నామినేట్ చేశావ్ అంటూ కొందరు అంటున్నారు. అయితే ఆ రోజున నాతో పాటు మరో నలుగురు అయిదుగురు కూడా పప్పు వల్ల చాలా ఇబ్బంది పడ్డాం.
వారం రోజుల పాటు ఆ ప్రభావం మాపై పడింది. వాంతులు విరేచనాలతో మేము పడ్డ బాధ మాకే తెలుసు. అందుకే ఆ విషయం చెప్పి నామినేట్ చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో మేమిద్దరం ఒక అవగాహణకు వచ్చేందుకు ఆమెను నామినేషన్ నుండి రక్షించి నేను సెల్ఫ నామినేట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. లాస్యను సేవ్ చేసి సెల్ఫ నామినేట్ అయిన దివి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.