బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ఫైనల్ 5 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ కమ్ నటుడు నోయల్ అనారోగ్య పరిణామాల నేపథ్యంలో బయటకు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. టాస్క్ ల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. ఆయన ఎక్కువ శాతం పక్కకు ఉంటున్నాడు. ఆయన వల్ల పలు గేమ్స్ డిస్ట్రబ్ అయ్యాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా కూడా యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని అది సాధ్యం కాలేదు. ఇక రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లుగా ఉంది. అందుకే అతడికి మెరుగైన చికిత్స కొసం ఆసుపత్రికి తరలించాల్సిందే అంటూ వైధ్యులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో హౌస్ నుండి నోయల్ బయటకు వెళ్లి పోయాడు.
నోయల్ వెళ్లి పోయే ముందు తిరిగి పూర్తి ఆరోగ్యంతో అతి త్వరలోనే మీరు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని ఆశిస్తున్నాం అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఆ మాటలతో నోయల్ మళ్లీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నోయల్ ఆరోగ్యం కుదుట పడితే రేపు లేదా ఎల్లుండి వరకు మళ్లీ హౌస్ లో అడుగు పెట్టనున్నాడు. మరీ ఎక్కువ రోజులు అయితే ఆయన్ను ఎలిమినేట్ చేస్తున్నట్లుగా కూడా షో నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయటకు వెళ్లిన వారు లోనికి వెళ్లడం చాలా ప్రమాదం. అది హౌస్ లో ఉన్న వారి ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే నోయల్ విషయంలో ఎక్కువ సమయం వేచి చూడక పోవచ్చు అనిపిస్తుంది.
గంగవ్వ కూడా అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లి పోయింది. ఆమె అయిదు వారాలు పూర్తిగా ఉన్న తర్వాత వెళ్లి పోయింది. నోయల్ ఉండాలని బలంగా కోరుకున్నా కూడా అనారోగ్య కారణాలు ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించింది. ముందు రోజు తెల్ల వార్లు అతడు నిద్ర పోకుండా అటు ఇటు తిరగడం చూడవచ్చు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో కూడా అతడు పడుకోకుండా పెయిన్ తో బాధపడ్డట్లుగా నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. ఇక తెల్లవారితే శుక్రవారం అనగా అంటే నిన్న తెల్లవారు జామున మూడు గంటలకు నోయల్ బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం నోయల్ ఆరోగ్య విషయమై ఎలాంటి అప్ డేట్ లేదు.