థియేట‌ర్ల‌లో `తాగుడు` కిక్కు.. ఇంకేమైనా ఉందా?

Update: 2020-05-16 04:15 GMT
మూలిగే న‌క్క‌ పై తాటి పండులా క‌రోనా లాక్ డౌన్ సినీ ప‌రిశ్ర‌మ‌ల్ని అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే థియేట‌ర్ల వ్య‌వ‌స్థ స‌ర్వ‌నాశన‌మైంద‌ని ఎగ్జిబిట‌ర్లు లబోదిబోమంటున్నారు. అయితే ఇదే స‌రికొత్త ఐడియాల్ని కూడా ఇస్తోంది. ఈ ఐడియాలో భాగంగానే విదేశీ త‌ర‌హాలో ఇక‌పై మ‌న‌ థియేట‌ర్ల‌లోనే బీర్ లు.. బ్రీజ‌ర్లు అమ్మితే ఎలా ఉంటుంది? అని అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు మైండ్ కి తోచింద‌ట‌.

ఇంకేం ఉంది? ఆ మాట‌నే ఆయ‌న రానాతో అంటుండ‌గా యువ‌ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ విన్నార‌ట‌. అవును ఐడియా ఎలా ఉంది?   మీ అభిప్రాయం చెప్పండి.. అంటూ నెటిజ‌నుల‌తో డిబేట్ పెట్టారు ఈ యంగ్ డైరెక్ట‌ర్. అయితే దానికి రిప్ల‌య్ లు కూడా అంతే ఘాటుగా ఉన్నాయి. బీర్ లు .. బ్రీజ‌ర్లు తాగితే మ‌నోళ్లు మామూలుగా ఉంటారా?  చెల‌రేగిపోరూ? అలాంట‌ప్పుడు ఫ్యామిలీ ఆడియెన్ థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అంటూ నెటిజ‌నులు కౌంట‌ర్లు వేశారు.

అయినా బిజినెస్ మేన్ల మైండ్ సెట్ వేరు. ఎక్క‌డ ఏది అమ్మితే లాభం వ‌స్తుంది?  ధ‌నార్జ‌న చేయ‌డ‌మెలా? అనే ఆలోచ‌న త‌ప్ప అందులో విచ‌క్ష‌ణా జ్ఞానం వంద‌శాతం ఉంటుంద‌ని చెప్ప‌లేం. మ‌న మాస్ యూత్ థియేట‌ర్ల ద‌గ్గ‌ర సృష్ఠించే హంగామా గురించి తెలియ‌నిదే. అమ్మాయి క‌నిపిస్తే చెల‌రేగిపోయే ఈ బ్యాచ్ చేతికి బీర్లు తాగండి.. బ్రీజ‌ర్లు ఆస్వాధించండి అని చేతికిస్తే ప‌రిస్థితి ఇంకెలా మారుతుందా? ఊహించ‌గ‌ల‌మా? అస‌లే ఆకతాయిల్ని కంట్రోల్ చేసేందుకు షీటీమ్ లు ఎన్ని ఉన్నా స‌రిపోవ‌డం లేదు హైద‌రాబాద్ లాంటి చోట్ల‌. న‌గ‌రాల‌న్నిటికీ షీ టీమ్ ల‌ను విస్త‌రిస్తున్నారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఊరూరా ప్ర‌త్యేకించి లేడీ స‌మ‌స్య‌ల గురించి ఒక సెల్ ని ఏర్పాటు చేసే ఆలోచ‌న‌ల్లో ఉన్నార‌ట‌. ఇలాంట‌ప్పుడు థియేట‌ర్ల‌లో బీర్ తాగండి.. బ్రీజ‌ర్ వేయండి! అంటే కుదురుతుందంటారా?  సింగిల్ స్క్రీన్ల ద‌గ్గ‌ర ఊర మాస్ ర‌చ్చ ఎలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా? క‌నీసం మ‌ల్టీప్లెక్సుల్లో అయితే కొంత‌వ‌ర‌కూ అదుపు చేయ‌గ‌ల‌రు కానీ.. అక్క‌డా ఆక‌తాయిల‌కు కొద‌వేమీ లేదు. అయినా హైద‌రాబాద్ రోడ్ల‌పై బీర్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కుకునేందుకు ఎవ‌రైనా సిద్ధంగా ఎందుకు ఉంటారు?
Tags:    

Similar News