నిన్నటి తరం స్టార్ హీరోలలో భానుచందర్ ఒకరు. తమిళ .. తెలుగు భాషల్లో హీరోగా ఆయన ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. ఒకప్పుడు తెలుగులో సూపట్ హిట్ సాంగ్స్ ను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు తనయుడే భానుచందర్. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకి మంచి ప్రవేశం ఉంది. అందువలన ఆయన కెరియర్ ఆరంభంలో యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వెళ్లారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
"నేను హీరోను అవుతాననే నమ్మకం మా ఫాదర్ కి ఎప్పుడూ ఉండేది కాదు. మా అమ్మ మాత్రం నేను హీరోను అవుతానని అంటూ ఉండేది. 'సంగీత దర్శకుడిగా నాన్నకి రావలసినంత గుర్తింపు రాలేదు. ఆయన తెర వెనుకనే ఉండిపోయారు. నువ్వైనా తెరపై కనిపించారా' అనేది.
దాంతో నేను కూడా హీరోను కావాలని అనుకునేవాడిని. నా ఫ్రెండ్స్ మాత్రం 'నువ్వు హీరో ఏంట్రా? ఎప్పుడైమ్నా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? బుద్ధిగా మీ నాన్న దగ్గర సంగీతం నేర్చుకో' అనేవారు. ఏదో ఒక రోజున నేను హీరోనై చూపిస్తానని నేను అనేవాడిని.
అలా నేను 'తరంగిణి' సినిమా చేసిన తరువాత ఆ సినిమాకి నా ఫ్రెండ్స్ ను తీసుకుని వెళ్లాను. వాళ్లంతా నా యాక్టింగ్ చూసి చాలా గొప్పగా చేశావురా అంటూ మెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగులో నాకు 'ముక్కుపుడక' .. స్వాతి' .. 'నిరీక్షణ' వంటి మంచి సినిమాలు పడ్డాయి. రజనీకాంత్ గారు నాకు మార్గదర్శి .. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే నేను హీరోగా నిలదొక్కుకున్నాను. అప్పట్లో చిరంజీవి .. నేను రూమ్మేట్స్ గా ఉండేవాళ్లం. నేను బైక్ నేర్చుకోవాలని అనుకుంటున్నప్పుడు నాకు రాయల్ ఎన్ ఫీల్డ్ నడపడం నేర్పించిందే చిరంజీవి.
చిరంజీవికి .. నాకు మధ్య ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ ఉంది. ఏరా .. ఏరా అనే అనుకుంటూ ఉంటాము. ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఆయన మెగాస్టార్ అయ్యుండొచ్చు .. కానీ నాకు మాత్రం ఒక మంచి స్నేహితుడే.
ఇప్పుడున్న దర్శకులలో నాకు రాజమౌళి ప్లానింగ్ నచ్చుతుంది. నేను 'సింహాద్రి' సినిమాలో నా పాత్రకి డబ్బింగ్ చెబుతున్నప్పుడే రాజమౌళిని పిలిపించాను. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడం ఖాయమని చెప్పాను. అదే స్థాయికి ఆయన వెళ్లిపోయాడు. ఒక సినిమాను ఎలా తీయాలో కాదు .. ఎలా బిజినెస్ చేయాలో కూడా ఆయనకి బాగా తెలుసు అని భానుచందర్ చెప్పుకొచ్చారు.