కోరి కష్టాలు తెచ్చుకోవటంలో ఆనందం ఏమిటో అస్సలు అర్థం కాదు. సెలబ్రిటీలకు ఉండే ఫాలోయింగ్ దృష్ట్యా వారి మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. వారు చేసే ప్రతి చిన్న పని అందరి దృష్టిని ఆకర్షిస్తుంటి. తప్పు చేస్తే ఎంతలా దొరికిపోతారో.. మంచి చేస్తే అంతలా ఫోకస్ అయిపోతుంటారు. అయితే.. మంచి కంటే చెడు విషయాలకు సంబంధించి కొందరు దొరికిపోయి వార్తల్లోకి రావటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది.
బుల్లితెర నటుడు.. పలు ప్రముఖ సీరియల్స్ లో నటించిన భరణి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు. శుక్రవారం రాత్రి తాగి కారు నడుపుతున్న ఆయన్ను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్లతో చేపట్టిన టెస్ట్ లో 41 శాతం మేర మద్యం సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా తాగి కారు నడుపుతున్న నేరానికి.. ఆయనపై కేసు నమోదు చేసి.. కారును సీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి కూడా.. ఇలా దొరికిపోవటాన్ని ఏమనాలి?