అప్ప‌ట్లో చిరు.. ఇప్ప‌డు ప‌వ‌ర్ స్టార్‌

Update: 2022-05-21 05:58 GMT
వెండితెర‌పై లెక్చ‌ర‌ర్ పాత్ర‌ల‌కు,  ఆ పాత్ర‌ల్లో స్టార్ హీరోలు న‌టించిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్న రికార్డుంది. కొంత మంది స్టార్ లే ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టించినా అవి ఏ విష‌యంలోనూ స్టార్స్ తో పాటు వారి అభిమానుల్ని నిరుత్సాహ ప‌ర‌చ‌లేదు. మంచి విజ‌యాల్ని సొంతం చేసుకుని స్టార్ హీరోల కెరీర్ లో మంచి చిత్రాలుగా నిలిచిపోయాయి. ఈ విష‌యంలో ముందుగా చెప్పుకోవాల్సింది విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన `సుంద‌రాకాండ‌`. లెక్చ‌ర‌ర్‌, స్టూడెంట్ మ‌ధ్య ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఈ సినిమాని రూపొందించారు.

వెంకీ కెరీర్ లో గుడ్ మూవీగా నిల‌వ‌డ‌మే కాకుండా ఆడియో ప‌రంగానే మంచి మార్కులు కొట్టేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి 1997లో న‌టించిన `మాస్ట‌ర్‌` మూవీ కూడా మంచి హిట్ గా నిలిచి చిరు కెరీర్ ని మ‌ళ్లీ గాడిలో పెట్టింది. ఇందులో చిరు క‌నిపించిన తీరు, పాత్ర‌ని మ‌లిచిన తీరు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో అత‌నికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.  ఇక `మిర‌ప‌కాయ్` లో ర‌వితేజ త‌న‌దైన మార్కు కామెడీతో స్టూడెంట్ పై మ‌న‌సుప‌డే లెక్చ‌ర‌ర్ గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియో ప‌రంగానూ మంచి హిట్ అనిపించుకుంది.

నంద‌మూరి బాల‌కృష్ణ `సింహా`లో తొలి సారి లెక్చ‌ర‌ర్ గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఓ పాత్ర‌లో సీరియ‌స్ గా క‌నిపించిన బాల‌య్య మ‌రో పాత్ర‌లో లెక్చ‌ర‌ర్ గా క‌నిపించి అల‌రించారు. ఇప్ప‌డు ఇదే త‌ర‌మాలో మెగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా లెక్చ‌ర‌ర్ గా క‌నిపించ‌బోతున్నార‌ట‌. 1997లో మెగాస్టార్ `మాస్ట‌ర్‌` మూవీలో లెక్చ‌ర‌ర్ గా త‌న‌దైన పంథాలో ఆక‌ట్టుకుంటే అదే ఫార్ములాని ప‌వ‌ర్ స్టార్ త‌న తాజా చిత్రం కోసం ఫాలో అవుతున్నార‌ట‌.

వివ‌రాల్లోకి వెళితే.. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌బోతున్న మూవీ `భ‌వ‌దీయుడు భ‌గత్ సింగ్‌`. పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ గ‌త కొంత కాలంగా వివిధ కార‌ణాల వ‌ల్ల సెట్స్ పైకి వెళ్ల‌డానికి సరైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తండ్రీ కొడుకులుగా క‌నిపిస్తార‌ని, ఓ పాత్ర‌లో లెక్చ‌ర‌ర్ గా ప‌వ‌న్ ..భ‌గ‌త్ సింగ్ వీర‌భ‌క్తుడిగా, ఆయ‌న భావాజాలంతో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ వెల్ల‌డించడంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఆ కార‌ణంగానే టైటిల్ ని పెట్టార‌ని తెలిసింది. ప‌వ‌న్ ఇంత వ‌ర‌కు స్టూడెంట్ గానే క‌నిపించారు. అయితే తొలి సారి ఈ మూవీ కోసం లెక్చ‌ర‌ర్ గా క‌నిపించ‌బోతుండ‌టం ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఈ న్యూస్ విన్న ప‌వ‌న్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హ్యాపీ ఫీల‌వుతున్నార‌ట‌. జూలై లేదా ఆగ‌స్టు నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని చెబుతున్నారు. ఇక సినిమాని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌ట‌. హ‌రీష్ శంక‌ర్ - ప‌వ‌న్ ల కాంబినేష‌న్ లో ఇంత‌కు ముందు `గ‌బ్బ‌ర్ సింగ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News