సర్ ప్రైజ్.. ఒక్క రోజు ముందుగానే 'భీమ్లా నాయక్'
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్న ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా ను ఈనెల 25న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించి హడావుడి చేసిన విషయం తెల్సిందే.
తాజాగా స్ట్రీమింగ్ తేదీని ఒక రోజు ముందుకు తీసుకు వచ్చినట్లుగా ప్రకటించారు. సర్ ప్రైజ్ అంటూ భీమ్లా నాయక్ సినిమా ను ఈనెల 25న కాకుండా ముందు రోజే అంటే 24వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా కొత్త ప్రకటన ఇచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా వారు కూడా కొత్త స్ట్రీమింగ్ తేదీని ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చారు. రెండు ఓటీటీ ల్లో కూడా ఈ సినిమా ను భారీ ఎత్తున ప్రేక్షకులు చూసే అవకాశం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈనెల 25వ తారీకున ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతుంది. ఆ సందడి నేపథ్యం లో భీమ్లా నాయక్ సందడి కనిపించక పోవచ్చు అంటూ కొందరు కాస్త నిరాశలో ఉన్నారు. వారందరికి కూడా ఆనందం కలిగించేలా ఈ కొత్త ప్రకటన ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ కు భీమ్లా నాయక్ రావడం వల్ల రెండు సినిమాలకు పోటీ ఉండక పోవచ్చు.
భీమ్లా నాయక్ సినిమా మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఆ సినిమా ను పూర్తి గా మార్చి కమర్షియల్ యాంగిల్ లో.. పవన్ కళ్యాణ్ పాత్ర కోణం లో కథను త్రివిక్రమ్ రాయడం జరిగింది. ఆయన కథ మరియు డైలాగ్స్ సినిమా కు అదనపు ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమా ను సూపర్ హిట్ అవ్వడం లో కీలక పాత్ర పోషించాయి అనడంలో సందేహం లేదు.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ సినిమా లో నిత్యా మీనన్ నటించగా రానా మరో కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. అహంకారానికి మరియు ఆత్మ గౌరవానికి మద్య జరుగుతున్న పోరు అంటూ భీమ్లా నాయక్ సినిమా పబ్లిసిటీని జోరుగా చేశారు.
ఇంకా సినిమా పై బజ్ అలాగే ఉంది. కనుక డిజిటల్ స్ట్రీమింగ్ కూడా రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది. ఒక రోజు ముందుగానే రాబోతున్న భీమ్లా నాయక్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా ఓటీటీ ల్లో రచ్చ చేయడం ఖాయం అంటున్నారు.