అప్పుడు రాజమౌళి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్..!
కరోనా పాండమిక్ నేపథ్యంలో సినిమాల విడుదల విషయంలో గందరగోళం ఏర్పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వారం ముందు వరకు చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. విడుదల తేదీలు బ్లాక్ చేసుకువడం.. మళ్ళీ వాయిదా వేసుకోవడం.. కొత్త డేట్స్ వెతుక్కోవడం. అన్నీ బాగున్నాయని అనుకునేలోపు.. పెద్ద సినిమాలు వచ్చి అంతా తారుమారు చేయడం. గత రెండేళ్లుగా ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది.
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఈ భారీ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ప్రతీసారీ ఇండస్ట్రీలో మిగతా చిత్రాల రిలీజుల్లో సందిగ్దత నెలకొంటుంది.
సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాలన్నీ థియేటర్లలోకి రావాలని ప్లాన్ చేసుకోగా.. RRR డేట్ ఇవ్వడంతో అందరూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వాయిదా బాట పట్టి కొత్త విడుదల తేదీలు వెతుకున్నారు.
కానీ ఈసారి థర్డ్ వేవ్ కారణంగా ట్రిపుల్ ఆర్ కు బ్రేక్ పడింది. దీంతో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. పరిస్థితులు సానుకూలంగా మారుతుండటంతో ఫిబ్రవరి మొదలుకొని సమ్మర్ సీజన్ ఎండింగ్ వరకు విడుదల తేదీలను ప్రకటించారు. అలాంటి సమయంలో RRR మూవీ కోసం జక్కన్న రెండు డేట్స్ అనౌన్స్ చేసి రిలీజులన్నీ అస్తవ్యస్థమయ్యేలా చేశారు. ఎప్పుడు ఏ సినిమా వస్తుందో తెలియని అయోమయ స్థితికి తీసుకొచ్చారు.
ఫైనల్ గా రెండు తేదీలను వదిలేసి మరో కొత్త రిలీజ్ డేట్ మీద కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. దీంతో మరోసారి టాలీవుడ్ రిలీజుల్లో గందరగోళం ఏర్పడింది. ఏదైతేనేం RRR సినిమాకు తగ్గట్లుగా మిగతా పెద్ద సినిమాలు - చిన్న మీడియం చిత్రాలు విడుదల ప్లాన్ చేసుకున్నాయి. అయితే అప్పుడు జక్కన్న మాదిరిగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ లను కెలికేసే బాధ్యత తీసుకున్నారు.
'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. అదే 25వ తేదీకి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'గని' 'సెబాస్టియన్' సినిమాల్ని కూడా షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. పవన్ సినిమా వస్తుందో రాదో అనే అనుమానంతో ఈ ఆలోచన చేశారు మేకర్స్. మొన్నటి వరకు భీమ్లా మేకర్స్ సైలెంట్ గా ఉండటంతో మిగతా మూడు సినిమాలు రిలీజ్ కు సన్నాహాలు చేసుకున్నారు.
శర్వానంద్ - వరుణ్ తేజ్ చిత్రాలను ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించి.. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేయడం.. థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ కలిసొచ్చాయని సంతోషపడ్డారు. అయితే సడన్ గా రాత్రికి రాత్రి 'భీమ్లా నాయక్' నిర్ణయం షాక్ ఇచ్చేలా చేసింది. పవన్ సినిమా ఫిబ్రవరి 25నే రాబోతోందని పోస్టర్ వదిలేశారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే 'వాలిమై' 'గంగుబాయి' వంటి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు 'భీమ్లా నాయక్' డేట్ కూడా ఫిక్స్ అవడంతో మిగతా చిత్రాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ సినిమాని ఢీకొట్టే సాహసం చేస్తే.. ఆ నిర్ణయం వసూళ్ల మీద ప్రభావం అవకాశం ఉంటుంది. అందుకే 'సెబాస్టియన్' ఊసేలేదు.
'గని' సినిమా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. నిర్మాతలు మెగా ఫ్యామిలీకి చెందినవారే కావడంతో మరోసారి పోస్ట్ పోన్ తప్పదని టాక్ నడుస్తోంది. మరోవైపు 'ఆడవాళ్లు..' కోసం శర్వా దిగి ప్రచారం చేసుకుంటున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు శివరాత్రి లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని భావించాడు. కానీ ఇప్పుడు మంచి డేట్ వదులుకొని వెనక్కి తగ్గడం అంటే కష్టమే.
ఇలా భీమ్లా నాయక్ వల్ల మిగతా సినిమాల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే విధంగా తయారయ్యింది. నైట్ కు నైట్ ఒక్క పోస్టర్ తో పవన్ కళ్యాణ్ మిగతా సినిమాల రిలీజుల ప్లానింగ్స్ అన్నీ తారుమారు చేసేశారని అనొచ్చు.