పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ను కేవలం రెండు నెలల్లోనే ముగిస్తారనే వార్తలు ప్రారంభించిన సమయంలో వచ్చాయి. కరోనా వల్ల సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. సినిమా ను ఈ ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. భారీ అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఇంకా షూటింగ్ షూటింగ్ అంటూ యూనిట్ సభ్యులు చెబుతూ ఉండటం ఆందోళన కలిగించింది. షూటింగ్ ఇంత లేట్ అయ్యింది ఏంటీ అంటూ కొందరు.. సినిమా సంక్రాంతికి వచ్చేనా అంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న సమయంలో చిత్రం షూటింగ్ ను ముగించినట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను దర్శకుడు సాగర్ చంద్ర మాస్ ఎలిమెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకు నప్పే విధంగా యాడ్ చేశాడంటూ సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ సినిమా కు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం అందించడం వల్ల సినిమా పై మరింతగా అంచనాలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ కు చెందిన కీలక సన్నివేశాల విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ తెరకెక్కించారని వార్తలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమా లో రానా నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించింది. నిత్యా మీనన్ మరియు పవన్ కళ్యాణ్ ల కాంబో సన్నివేశాలు మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయడం కోసం ఏర్పాట్లు మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది. ఈ నెల చివరి వరకు సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తారు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అవుతాయి. సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ వంటి పెద్ద పాన్ ఇండియా సినిమాలు వస్తున్నా కూడా భీమ్లా నాయక్ కు వచ్చే ముప్పు ఏమీ లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే చాలు కోట్ల వర్షం కురుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.