తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు టైమ్ దగ్గర పడింది. గత ఏడాది టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 కి మంచి స్పందన రావడంతో వెంటనే నాన్ స్టాప్ అంటూ బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ ను తీసుకు వచ్చారు. అంతా ఊహించినట్లుగా కాకుండా ఓటీటీ వెర్షన్ కు జనాల ఆధరణ దక్కలేదు. ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే బిగ్ బాస్ నాన్ స్టాప్ ను ఆధరించారు. అయినా కూడా స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 6 కు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 6 కు సంబంధించిన లోగో విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రోమో తో సీజన్ 6 అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించారు. మరో వైపు బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యులకు అవకాశం అంటూ అధికారికంగా ప్రకటించి ఎంట్రీలను కూడా ప్రారంభించారు. త్వరలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ను ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ సీజన్ లో అడుగు పెట్టడం కోసం సోషల్ మీడియాలో సందడి చేసే చాలా మంది సెలబ్రెటీ లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని వేల మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడం కోసం అప్లికేషన్ లు పెట్టుకుంటున్నారు. కొందరు సెలబ్రెటీ హోదాలో హౌస్ లో అడుగు పెట్టడం కోసం పైరవీలు కూడా చేయిస్తున్నారంటూ సమాచారం అందుతోంది. అందుకోసం అధికార పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారట.
బిగ్ బాస్ లో అడుగు పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాని బిగ్ బాస్ లో ఉండటం వల్ల తమ సోషల్ మీడియా అకౌంట్ కు ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ కు అధికారిక వెరిఫికేషన్ వస్తుంది. తద్వారా సోషల్ మీడియాలో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే బిగ్ బాస్ లో అడుగు పెట్టాలని చిన్నా చితకా సెలబ్రెటీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
బిగ్ బాస్ ద్వారా ఎంత వచ్చినా.. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో ఆఫర్లు రాకున్నా కూడా సోషల్ మీడియాలో గుర్తింపు.. మరియు బ్లూ టిక్ వస్తుంది కనుక ఇన్ స్టా నుండి ఆదాయం వస్తుంది అనేది కొందరి ఆలోచన. అందుకే బిగ్ బాస్ లో అడుగు పెట్టడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
పారితోషికం తక్కువ అయినా పర్వాలేదు తమ ఇన్ స్టా వెరిఫికేషన్ అయితే చాలు అన్నట్లుగా చాలా మంది బిగ్ బాస్ వైపు చూస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 6 ను ఆగస్టు లో ప్రారంభించే అవకాశం ఉందట.