యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ మూవీని అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సంయుక్తంగా నిర్మించారు. 2008 లో ముంబైలోని తాజ్ హోటల్ పై తీవ్ర వాదులు సృష్టించిన మారణ హోమం నేపథ్యంలో ఈ మూవీని అత్యంత ప్రతి ష్టాత్మకంగా నిర్మించారు.
సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీరి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో ప్రత్యేక షోలని చిత్ర బృందం ప్రదర్శించింది.
దీనికి ప్రతీ చోట ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మాజీ సైనికులు ఆనాటి సంఘటనలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కొంత మంది ప్రేక్షకులు, మరీ ప్రధానంగా మహిళా ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకోవడం తెలిసిందే.
దీనికి సంబంధించిన వీడియోలని హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దేశ భక్తి ప్రధానంగా ఓ వీర జవాన్ వీరోచిత పోరాటానికి సంబంధించిన రియల్ స్టోరీతో రూపొందిన ఈ మూవీకి బీజేపీ వర్గాల నుంచి భారీ సపోర్ట్ లభిస్తుందని అంతా ఊహించారు. కానీ ఈ మూవీపై ఏ ఒక్క బీజేపీ లీడర్ స్పందించలేదు. గతంలో 'ది కశ్మీర్ ఫైల్స్' కు బీజేపీ శ్రేణులు భారీ స్థాయిలో స్పందించాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మూవీకి టాక్స్ ని మినహాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం విశేషం. ఆ తరువాత అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన 'సమ్రాట్ పృథ్వీరాజ్' మూవీకి కూడా పలు రాష్ట్రాలు ట్యాక్స్ మినహాయింపునిచ్చాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్ర బృందాన్ని తన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సత్కరించారు కూడా. అయితే 'మేజర్' ని మాత్రం పట్టించుకోకపోవడంతో పలు విమర్శలు వినిపించడం మొదలైంది.
ఈ నేపథ్యంలో 'మేజర్' టీమ్ ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా పిలిపించి తాజాగా సత్కరించారు. హీరో అడివి శేష్‌తో పాటు సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ ని కూడా పత్ర్యేకంగా అభినందించి సత్కరించడం విశేషం . ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.