RRR: నెమ్మదిగా బయటకు వస్తోన్న బీటౌన్ ప్రముఖులు..!

Update: 2022-03-29 15:30 GMT
'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమాతో తన ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా మాస్టర్ స్టోరీ టెల్లర్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామా.. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా అన్ని ఏరియాల్లోనూ సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్ సీస్ లోనే కాకుండా నార్త్ మార్కెట్ లోనూ RRR గట్టి ప్రభావం చూపిస్తోంది. తొలి రోజు స్లోగా ప్రారంభించి మంగళవారానికి 100 కోట్ల మార్క్ అందుకోనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే 'RRR' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నా.. బాలీవుడ్ ప్రముఖులు సినిమాను ప్రశంసించకపోవడం.. సక్సెస్ మీద స్పందించకపోవడం టాలీవుడ్ జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజమౌళి - రామ్ చరణ్ - తారక్ లతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు కూడా ఒక్క ట్వీట్ అయినా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో భాగమైన బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ సైతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టకపోవడంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు బీటౌన్ సెలబ్రిటీలు సినిమా గురించి మాట్లాడటం చూస్తుంటే.. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బాలీవుడ్ ట్రిపుల్ ఆర్ వైపు వస్తోందని అర్థం అవుతోంది.

RRR లో సీత పాత్ర పోషించిన అలియా భట్.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మూవీ కలెక్షన్స్ గురించి పోస్ట్ పెట్టింది. మూడు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ను అలియా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో లేటెస్టుగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా ఓపెన్ అయ్యాడు.

ఇండియన్ ఎక్స్పో 2020-దుబాయ్ లో పాల్గొన్న రణవీర్.. RRR సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అన్ని బాలీవుడ్ సినిమాలను బీట్ చేస్తోందని.. ఇది చాలా గర్వపడాల్సిన విషయమని అన్నారు. రాజమౌళి మాదిరిగా భారతీయ కథలను ప్రపంచ వ్యాప్తం చేయడమే మనం చేయాల్సింది అంటూ 'నాటు నాటు' పాటని హమ్ చేశారు రణ్వీర్.

ఇంతకుముందు హిందీ హీరో వివేక్ ఒబేరాయ్ - దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా RRR సినిమా విజయాన్ని ప్రశంసింస్తూ.. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్లు పెట్టారు. ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సక్సెస్ ని యాక్సెప్ట్ చేస్తూ నెమ్మదిగా బయటకు వస్తున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఉత్తరాదిలో RRR సినిమా స్ట్రాంగ్ గా ఉంది. ఫస్ట్ డే 19 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా.. తర్వాతి రోజు పుంజుకొని రూ.24 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలో ఆదివారం రూ. 31.50 కోట్ల మేర కలెక్ట్ చేసి సంచలనం రేపింది. ఇక కీలకమైన సోమవారం నాడు 17 కోట్లు వసూలు చేసి మొత్తంగా హిందీలో నాలుగు రోజుల్లో ₹ 91.50 కోట్లు అందుకుంది.

నార్త్ లో ప్రతిచోటా RRR అద్భుతమైన హోల్డ్ లో ఉంది. ముఖ్యంగా మాస్ సర్క్యూట్లలో దీని ప్రభావం గట్టిగా ఉంది. మంగళవారంతో ఈ సినిమా హిందీలో 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను క్రాస్ చేయనుంది. రాబోయే రోజుల్లో ఇది ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
Tags:    

Similar News