బ్రేకింగ్ : మీడియా సంస్థలపై ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్ ప్రముఖుల దావా...!
బాలీవుడ్ ఇండస్ట్రీపై కొన్ని మీడియా సంస్థల బాధ్యతా రహితమైన రిపోర్టింగ్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాతలు దావా వేశారు. సినీ ఇండస్ట్రీపై బాధ్యతా రహితమైన కథనాలు ప్రసారం చేస్తున్న రిపబ్లిక్ టీవీ మరియు టైమ్స్ నౌ మీడియా సంస్థలను నివేదించడానికి బాలీవుడ్ లోని నాలుగు ప్రధాన అసోషియేషన్స్ మరియు 34 పెద్ద నిర్మాణ సంస్థలు కలిసి దావా వేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. ఈ రెండు ఛానళ్లపై లీగల్ యాక్షన్ తీసుకోడానికి అమీర్ ఖాన్ - షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ - అజయ్ దేవ్‌గన్ - కరణ్ జోహార్ - ఆదిత్య చోప్రా - ఫర్హాన్ అక్తర్ - అనిల్ కపూర్ - అర్భాజ్ ఖాన్ సహా మరికొందరు సినీ ప్రముఖులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ టీవీ మరియు ఆ ఛానెల్ కు చెందిన అర్నాబ్ గోస్వామి - ప్రదీప్ భండారి లపై ఈ దావా వేయబడింది. అలానే టైమ్స్ నౌ మరియు ఆ ఛానెల్ కు చెందిన రాహుల్ శివశంకర్ - నవికా కుమార్ ల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఛానల్స్ గత కొన్ని నెలలుగా బాలీవుడ్ పై అవమానకరమైన పదాలు వ్యక్తీకరిస్తూ వస్తున్నాయని.. ఇండస్ట్రీని 'మురికి' 'మలినం' 'స్కర్మ్' 'డ్రగ్గీస్' అనే పదాలను ఉపయోగిస్తూ రిపోర్టింగ్ చేసారని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ''బాలీవుడ్ అంటే పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది'' ''అరేబియా పెర్ఫ్యూమ్స్ బాలీవుడ్ యొక్క దుర్వాసనను తీసివేయలేవు" ''ఇది దేశంలోనే డర్టీయెస్ట్ పరిశ్రమ" "కొకైన్ మరియు ఎల్ఎస్డి తో తడిసిన బాలీవుడ్" వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యానాలతో రిపోర్టింగ్ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా మాధ్యమాలు 'బాలీవుడ్ పై బాధ్యతా రహితమైన, అవమానకరమైన మరియు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం లేదా ప్రచురించడం మానుకోవాల'ని నిర్మాతలు అంటున్నారు. మీడియా ట్రయల్స్ నిర్వహించడం.. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల గోప్యతను ఉల్లంఘించడం కూడా ఛానెల్స్ ఆపాలని వారు కోరుతున్నారు. బాలీవుడ్ కు వ్యతిరేకంగా ప్రచురించిన అన్ని పరువు నష్టం కలిగించే విషయాలను ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా, యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో ఎలాంటి వాతావరణం నెలకొందో అందరికీ తెలిసిందే. నెపోటిజం అంటూ మొదలైన ఆరోపణలు లైంగిక వేధింపులు మరియు డ్రగ్స్ వైపుకు దారితీసాయి. దీంతో కొన్ని మీడియా ఛానల్స్ బాలీవుడ్ లో వెలుగు చూసిన ఈ విషయాలపై ఫోకస్ పెడుతూ కథనాలు ప్రసారం చేసాయి. అయితే దీనిపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా మూకుమ్మడిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. సుశాంత్ సూసైడ్ చేసుకునే చనిపోయాడని ఎయిమ్స్ బృందం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఒకానొక సమయంలో ఇప్పటి వరకు మీడియా ఛానల్స్ లో వచ్చినవన్నీ తప్పుడు కథనాలే అనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులు కూడా అందుకే రియాక్ట్ అయ్యారా.. బాలీవుడ్ ను పరిరక్షించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అని అందరూ చర్చించుకుంటున్నారు.
ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన వారిలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా - సినీ అండ్ టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ - యాడ్-ల్యాబ్స్ ఫిల్మ్స్ - అజయ్ దేవగన్ ఫిలిమ్స్ - అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ - అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ - అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ - ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ - కబీర్ ఖాన్ ఫిల్మ్స్ - నాడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ - రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా పిక్చర్స్ - రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ - రోహిత్ శెట్టి పిక్చర్స్ - రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ - వినోద్ చోప్రా ఫిల్మ్స్ మరియు విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.