కొన్ని నెలలుగా బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్...కోలీవుడ్ తో క్లోజ్ గా మూవ్ అవుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్లు అంతా టాలీవుడ్ స్టార్లతో సన్నిహితంగా మెలుగుతున్నారు. అప్పట్లో మిస్టర్ పర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ నాగచైతన్య ఆహ్వానించ కపోయినా ఆ యంగ్ హీరో సినిమా ఫంక్షన్ కి విచ్చేసి సర్ ప్రైజ్ చేసారు. అంతటి దిగ్గజ నటుడు ఏకంగా హైదరాబాద్ రావడం ఏంటి? అని అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఎప్పుడు హైదరాబాద్ వైపు చూడని అమీర్ అంతకు ముందు నుంచే టాలీవుడ్ కి టచ్ లో ఉన్నారు. ఇక కండల గండరుడు సల్మాన్ ఖాన్ కూడా మెగాస్టార్ చిరంజీవి..చరణ్ లకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. తన సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగినంత కాలం దాదాపు మెగా హీరోలు అందర్నీ చుట్టేసారు. ఇక బాద్ షా షారుక్ ఖాన్ ఏకంగా కోలీవుడ్ మేకర్ తోనే సినిమా చేస్తున్నాడు.
తన సినిమాలో సౌత్ నటుల్ని సైతం భాగం చేసి ముందుకు వెళ్తున్నాడు. ఈ రెండు సన్నివేశాల్ని బట్టి టాలీవుడ్..కోలీవుడ్ రేంజ్ ఏ స్థాయికి చేరిందన్నది అద్దం పడుతుంది. ఇక ఇటీవలి కాలంలో రాక్ స్టార్ రణబీర్ కపూర్ `బ్రహ్మాస్ర్త` సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సహాయమే తీసుకున్నారు. తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో బ్రహ్మస్ర్త ఒక్కసారిగా పైకి లేచింది.
ఆ సినిమా సౌత్ రైట్స్ దిగ్ధదర్శకుడు రాజమౌళికి అప్పగించి ఎన్ క్యాష్ చేసుకునే ప్లాన్ చేసాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ చిరంజీవి..సుకుమార్ లాంటి వాళ్లకు `లాల్ సింగ్ చద్దా` స్పెషల్ షో వేసి మరీ చూపించారు. ఇలాంటి సన్నివేశాలు ఇన్నేళ్ల టాలీవుడ్ చరిత్రలో ఏనాడు చోటు చేసుకోలేదు. 2022 లోనే ఈ అద్భుతాలు అన్ని జరుగుతున్నాయి.
ఇవన్నీ చూస్తుంటే? `బ్రహ్మస్ర్త`..`లాల్ సింగ్ చద్దా` హిందీ ప్రమోషన్లకి సైతం టాలీవుడ్ సెలబ్రిటీల చేత ముంబైలో కూడా చేయిస్తారా? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. చిరంజీవి..రాజమౌళిలను ముంబై ఆహ్వానించి అక్కడా తమ సినిమాలకు ప్రచారం చేయించుకునేలాగే సన్నివేశం కనిపిస్తుంది. ఎందుకంటే `బాహుబలి`...`ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాల్ని హిందీ బెల్ట్ లో స్థానిక హీరోలు ఎంతగానో ప్రోత్సహించారు.
అక్కడ నిర్వహించిన కొన్ని షోలకు సదరు హీరోలు హాజరయ్యారు. ఆ కృతజ్ఞతా భావంతోనైనా బాలీవుడ్ ఆహ్వానిస్తే టాలీవుడ్ సెలబ్రిటీలు వెళ్లకుండా ఉంటారా ? అనిపిస్తుంది. భాషల మధ్య వ్యత్యాసం కూడా ఇప్పుడిప్పుడే తొలగిపోతుంది. మనవాళ్లు పాన్ ఇండియా అంటూ హిందీ మార్కెట్ ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ల సహకారం అంతే అవసరం. కాబట్టి కలయిక ముఖ్యమే కదా.