కంగనా రనౌత్ కొంచెం తేడా అని ఎప్పట్నుంచో బాలీవుడ్ జనాలు అంటూనే ఉన్నారు. తల్లిదండ్రుల మాట కాదని సినిమా కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చేసిన ఈ రింగుజుత్తు సుందరి.. తనను చూడ్డానికి వచ్చిన తండ్రిని కూడా అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మంటుందంటూ అప్పట్లో ఓ ప్రముఖ పత్రికలో కథనం ప్రచురితమైంది. మీడియాతో మాట్లాడుతున్నపుడు కూడా చాలా యాటిట్యూడ్ చూపిస్తుంటుందీ అమ్మాయి. ఐతే కెరీర్ అంతంతమాత్రంగా ఉన్నప్పుడే నేల మీద నడవని కాళ్లు.. వరుసగా నాలుగు సూపర్ హిట్లు కొట్టాక ఇంకెక్కడ కిందికి వస్తాయి.
పోయినేడాది ఉంగ్లీ సినిమా షూటింగ్ సందర్భంగా నిర్మాతల్ని కంగన పెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ షెడ్యూల్ కంటే మూణ్నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చేదట. అంతే కాదు.. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తనకు నచ్చకున్నా అలాగే విడుదల చేసేయడంతో మండిపోయి ఆ తర్వాత ఏ ప్రమోషన్స్‌కు రానే లేదు. తను వెడ్స్ మను రిట్నర్న్స్ సూపర్ డూపర్ హిట్టవడం.. కంగనాను అందరూ ప్రశంసల్లో ముంచెత్తేడయంతో ఆమె ఆటలు మామూలుగా లేవంటున్నారు. ఎవరైనా కథ చెప్పడానికి వస్తే పైపైన చెబితే సరిపోదట. మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ ఆమె చేతికి ఇవ్వాలట. అవసరమైతే కథా చర్చల్లో కూడా పాల్గొంటుందని.. స్క్రిప్టులో మార్పులు కూడా చేస్తోందని అంటున్నారు. అమ్మడికి కవితలు, కథలు రాసే అలవాటుండటంతో తన సొంత డైలాగులు కూడా పెట్టమని అడుగుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక పారితోషకం విషయంలో అయితే కంగన సెగలు మామూలుగా లేవంటున్నారు. తను వెడ్స్ మను తర్వాత ఒకేసారి పారితోషకాన్ని 50 శాతం పెంచి రూ.6 కోట్లకు పెంచిన కంగనా.. అందులో పైసా తగ్గినా ఒప్పుకోవట్లేదంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు. మంచి నటి, పైగా క్రేజ్ ఉందని సర్దుకుపోతుంటే కంగన మరీ నెత్తినెక్కి కూర్చుంటోందని అంటున్నారు అక్కడి జనాలు. ఎంత మిడిసిపడ్డా ఇంకో మూణ్నాలుగేళ్లు పోతే హీరోయిన్‌గా కంగనకు ఆటోమేటిగ్గా డిమాండ్ తగ్గిపోతుంది. ఐతే కంగన వ్యవహారం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడంలాగా అయితే లేదు. ఈ నడమంత్రపు క్రేజ్ చూసుకుని మిడిసిపడుతున్నట్లే ఉంది.