''నా పరువు తీస్తున్నాడు.. మా వియ్యంకుడు డబ్బులు తీసుకుంటే దానిలో నా మిస్టేక్ ఏముంటుంది? ఆయన నా పేరు వాడినంత మాత్రాన నేను బాధ్యుడ్ని అవుతానా? నేనేమన్నా అప్పుకు గ్యారంటర్‌గా సంతకం పెట్టానా??'' అంటూ కోర్టులో కడిగిపాడేశాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. అయితే ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోలేదు ఫైనాన్షియర్ బోరా ముకుల్‌చాంద్. మనోడు కూడా కాస్త గట్టిగానే రజినీకి కౌంటర్ ఇస్తున్నాడు.
''నేనేమీ రజనీకాంత్‌ను డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పలేదు. నాకు రజనీకాంత్ ఇస్తారని ఆయన వియ్యకుండా కస్తూరి రాజన్ చెప్పారని మాత్రమే అంటున్నా. దానిపై రజనీ కాస్త అతిగా స్పందించి అనవసరంగా నా మీద కోర్టు పిటీషన్ లాడ్జ్ చేశారు'' అంటూ ముకుల్‌చాంద్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రజనీ కనుక తనపై కేసును ఉపసంహరించుకోకపోతే, ఖచ్చితంగా తాను కూడా రజనీపై కేసు పెడతానని అంటున్నాడు. పరువు నష్టం వేస్తాడట. ఏంటో పాపం రజనీకాంత్ టైమ్ అస్సలు బాగాలేదు. ఆయన రేంజ్ ఏంటి.. మొన్న లింగా డిస్ట్రిబ్యూటర్లు, ఇప్పుడీ ఫైనాన్షియర్లు ఇలా వార్నింగులు ఇచ్చేయడమేంటి.. ఏంటో బాబా లీలలు మరి.. రజనీకి అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది.