అందరి నోటా 'అఖండ' హిట్ అనే మాటే:

Update: 2021-12-03 04:42 GMT
బోయపాటి దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టిన దగ్గర నుంచి, యాక్షన్ కీ .. ఎమోషన్ కి పెద్ద పీట వేస్తూ వెళుతున్నారు. తన సినిమాలు మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన చూసుకుంటారు. కథ ఏదైనా అది మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలచుట్టూ అల్లుకుపోయి ఉంటుంది. ఇతర హీరోలతో ఆయన సినిమాలు చేసినప్పటికీ, బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి ఆయన కథలు కరెక్ట్ గా సెట్ అవుతూ వస్తున్నాయి. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' వంటి భారీ సినిమాలు విజయాలను అందుకున్నాయి.

ఆ తరువాత సినిమాగా 'అఖండ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ననే ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్స్ లో విడుదలైంది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ .. ఇప్పుడు అందరి నోటి వెంట ఒకే ఒక మాట వినిపిస్తోంది .. సినిమా సూపర్ .. డూపర్ హిట్ అని. అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల తరువాత .. రెండు కరోనా సమయాలను ఎదుర్కొన్న తరువాత రిలీజైన ఈ సినిమా, ఈ రోజున తెలుగు ప్రేక్షకులను .. నందమూరి అభిమానులందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది.

ఎప్పుడో చూశాము కటౌట్ల దగ్గర సందడి చేయడం .. నైట్ మెలకువతో ఉండి ఉదయాన్నే సినిమాకి వెళ్లడం .. మళ్లీ అవన్నీ ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు మాట రావడం లేదు. వాళ్లు చేస్తున్న ఎంజాయ్ .. వాళ్లు చూపిస్తున్న ఆ ఉత్సాహం చూసి, ఇక చాలు అనిపించింది. ఈ రోజున ఇంత అద్భుతంగా ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకీ .. అలాగే అద్భుతంగా ఆదరించిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలకృష్ణగారు అన్నట్టుగా ఇది మా విజయం కాదు .. తెలుగు సినిమా విజయం .. ఇండస్ట్రీ సాధించిన విజయం. ఈ మాట చెప్పడానికి నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.

మళ్లీ మీ అందరితో మాట్లాడతాను .. ఈ విజయాన్ని ఇలాగే ముందుకు తీసుకుని వెళ్లాలని మీ అందరినీ కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ .. 'అఖండ' సినిమా భారీ స్థాయిలో విడుదల కావాలనీ, థియేటర్లకు పూర్వ వైభవం తీసుకుని రావాలని ఇటు ఇండస్ట్రీ .. అటు అభిమానులు ఆశించారు. ఈ మధ్య కాలంలో థియేటర్స్ కి ఫ్యామిలీస్ రావడం తగ్గింది. ఈ సినిమాకి ఫ్యామిలీస్ కూడా వస్తుండటం విశేషం. ఇంతటి విజయానికి కారకులైన ప్రేక్షకులకే ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాము" అని చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News