సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు రాయాలంటే.. పేజీల కొద్దీ రాయాల్సిన పనిలేదు. కేవలం రెండు ఫొటోలతో.. నాలుగు వాక్యాలతో మీమ్స్ క్రియేట్ చేసి వదిలితే చాలు. విషయం చేరాల్సిన మేరకు చేరిపోతుంది. ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్ ఇదే. సరదాగా నవ్వుకోవడానికే కాదు.. సీరియస్ విషయాలను షేర్ చేయడానికి కూడా మీమ్స్ యూజ్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే.. ఈ మీమ్స్ లో ఎక్కువగా ఎవరి ఫేస్ వాడతారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. వంద మీమ్స్ తయారైతే.. అందులో దాదాపు 90కి పైగా బ్రహ్మానందం ఫొటో ఉండాల్సిందే. అంతలా మీమ్స్ ను ఆక్రమించేశాడు బ్రహ్మీ. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీమ్స్ పై స్పందించారరు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం. మూడు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి సినిమాలకే ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చిన కమెడియన్ ఆయన. ప్రస్తుతం ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. ప్రస్తుత జనరేషన్స్ ని కూడా ఎంతగా ఆకట్టుకున్నారో మీమ్సే చెబుతున్నాయి. అసలు.. బ్రహ్మీ లేకుంటే మీమ్స్ ఈ రేంజ్ లో వచ్చేవా? అనే సందేహం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందంటే.. ఆనంద బ్రహ్మ పాపులారిటీ సోషల్ మీడియాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. తనపై వచ్చే మీమ్స్ పై తొలిసారిగా బ్రహ్మానందం మాట్లాడారు. మీమ్స్ క్రియేట్ చేసే కొంతమంది బ్రహ్మానందం బర్త్ డే సందర్భంగా ఆయన దగ్గరకు వెళ్లారట. వారితో మాట్లాడిన బ్రహ్మీ.. చాలా సంతోషం వ్యక్తం చేశారట. మనం ఇలాగే కామెడీని కంటిన్యూ చేస్తూ.. ప్రతి ఒక్కరినీ సరదాగా నవ్వించే ప్రయత్నం చేద్దామని అన్నారట. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ చూసి తాను కూడా ఎంతో ఎంజాయ్ చేస్తానని అన్నారట.
సోషల్ మీడియాలోని మీమ్స్ గురించి మెగాస్టార్ కూడా మాట్లాడుతూ ఉంటారని చెప్పాడట బ్రహ్మీ. ‘నీ ప్రతి సినిమాలోని చిన్న చిన్న హావభావాలను కూడా గుర్తు పెట్టుకొని మరీ.. మంచి మంచి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి’ అని మెగాస్టార్ తనతో చెప్పినట్లు బ్రహ్మానందం తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు తెచ్చిన గిఫ్ట్స్ అందుకున్న బ్రహ్మీ.. వారితో ఫొటోలు కూడా దిగారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం.. ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరమయ్యాడు బ్రహ్మీ. మరి రానున్న రోజుల్లో మళ్లీ కెమెరా ముందుకు వచ్చి, మళ్లీ నవ్వుల పూలు పూయిస్తారేమో చూడాలి.