హోరాహోరీ: యాంగిల్‌ మ్యాజిక్‌ ఏదమ్మా?

Update: 2015-09-12 07:30 GMT
ఇటీవ‌లి కాలంలో రిలీజైన హిట్ సినిమాల్లో కెమెరా ప‌నిత‌నాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాలి. శ్రీ‌మంతుడు, మిర్చి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి  లాంటి సినిమాల్ని ప‌రిశీలిస్తే ఆ సినిమాల్లో ల‌వ్‌ - ఫ‌న్‌ - ఎమోష‌న్‌ ని క్యారీ చేసే స‌న్నివేశాల్లో కెమెరామేన్ ప‌నిత‌నం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అడ్వాన్స్‌ డ్ కెమెరా వ‌ర్క్ క‌నిపిస్తుంది. అలాంటి ఛాయాగ్ర‌హ‌ణానికి అల‌వాటు ప‌డిన క‌ళ్లు సింపుల్‌ గా ఉండే కెమెరా ప‌నిత‌నాన్ని ఒప్పుకుంటాయా? ఓమారు తేజను అడగండి.

తేజ లాంటి స్టార్ కెమెరామేన్ - టెక్నీషియ‌న్ ఓ సినిమా తీస్తే ఆ సినిమా ఓ దృశ్య కావ్యంలా ఉండాల‌ని ఆశించ‌డంలో త‌ప్పేం లేదు. పైగా రెయిన్ బ్యాక్‌ డ్రాప్ ల‌వ్‌ స్టోరీ అన‌గానే గీతాంజ‌లిని కొట్టేసేలా తీయాలి.  కీల‌క‌మైన శాఖ‌ల్లో ప్ర‌తి విభాగాన్ని సినిమాటోగ్ర‌ఫీ డామినేట్ చేస్తుంద‌నే అనుకుంటారంతా. కాని సినిమాటోగ్రాఫ‌ర్ దీప‌క్ భ‌గ‌వంత్ పర్వాలేదనే వర్కునే చేశాడు కాని.. కళ్లు చెదిరే వర్కును అందించలేదు.  ఈ సినిమాతో అవార్డులు అందుకోవ‌డం ఖాయం అని అన్నాడు తేజ‌. అయితే ఈ సినిమా కెమెరా వర్కులో అంత సీన్‌ లేదులేండి. అస‌లు ప్రేమ‌క‌థ‌ల‌కు కెమెరా ప్రాణం. ప్రేమ స‌న్నివేశాల్లో ల‌వ్ ఫీల్ ర‌ప్పించే బాధ్య‌త ద‌ర్శ‌కుడికి ఎంత ఉంటుందో కెమెరామేన్‌ కి కూడా అంతే ఉంటుంది.  ఒక‌వేళ ఏదైనా ఫీల్ మిస్స‌యితే అది చెప్పాల్సిన బాధ్య‌త కూడా కెమెరామేన్‌ కే ఉంటుంది. కానీ ఆ విభాగంలో పూర్తి ఫెయిల్యూర్ క‌నిపించింది.
Tags:    

Similar News