చెప్పుల సీన్.. వాళ్ల కోసమే పెట్టారా!!

Update: 2016-05-16 09:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అండార్స్ మెంట్స్ విషయంలో తెగ జోరు చూపిస్తాడు. బాలీవుడ్ స్టార్స్ తో పోటీగా బ్రాండ్స్ మహేష్ బాబు చేతిలో ఉంటాయి. లోకల్ - నేషనల్ తోపాటు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు కూడా మహేష్ బ్రాండ్ అంబాసిడర్. కానీ ఇప్పుడో చెప్పుల కంపెనీ మాత్రం.. మహేష్ ఫ్యాన్స్ ని తెగ హర్ట్ చేసేస్తోంది.

బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ లో భాగంగా.. మహేష్ ఓ పెద్దాయన కోసం చెప్పులు పట్టుకుంటున్న ఫోటోను పోస్టర్ గా వేశారు. ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎంత సింపుల్ కేరక్టర్ ని మహేష్ చేస్తున్నాడో అన్నట్లుగా ఉన్న ఈ పోస్టర్.. అభిమానులను - ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడో చెప్పుల కంపెనీ మాత్రం.. ఈ పోస్టర్ ని తెగ వాడేస్తోంది. మహేష్ బాబును ఆల్మోస్ట్ చెప్పుల షాపులో కస్టమర్లకు చెప్పుల తొడిగే వ్యక్తి అన్న రేంజ్ లో పోస్టర్ వేసేసుకుని ప్రచారం చేసేస్తోంది. తమ హీరో ఫోటోను ఇంత దారుణంగా వాడేస్తుండడంపై అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.

టీవీల్లోనూ - పేపర్లలోనూ ఆ చెప్పుల కంపెనీ ఇస్తున్న యాడ్స్ - ప్రచారం చూస్తుంటే.. అసలు వాళ్ల కోసమే ఈ సీన్ పెట్టారా ఏంటి అనే అనుమానం కూడా చాలా మందికి వస్తోంది. బ్రాండ్ ప్రమోషన్స్ కామనే కానీ.. మరీ తమ సూపర్ స్టార్ ని ఇలా చూసి తట్టుకోవడం ఫ్యాన్స్ కి వల్లకావడం లేదు. వీళ్ల ఫీలింగ్ చూస్తుంటే.. మహేష్ చెప్పులు అందించే పోస్టర్ ని ఇంత దారుణంగా వాడేందుకు ఇవ్వకుండా ఉంటే బాగుండేదని ఆడియన్స్ కి అనిపిస్తోంది.
Tags:    

Similar News