రాజమౌళి కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘మర్యాద రామన్న’. ‘మగధీర’ లాంటి మెగా హిట్ తర్వాత.. ఆశ్చర్యకరంగా సునీల్ ను హీరోగా పెట్టి ఈ చిన్న సినిమా చేశాడు జక్కన్న. తనదైన శైలి మాస్ అంశాలు లేకుండా కూడా ప్రేక్షకుల్ని మెప్పించాడతను. ఇందులో పాటలు కూడా రాజమౌళి మిగతా సినిమాలకు భిన్నంగా ఉంటాయి. కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్స్ వినిపిస్తాయిందులో. ముఖ్యంగా ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే.. అంటూ టైటిల్స్ పడేటపుడు వచ్చే పాట చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. నిజానికి ఈ పాట ఆడియోలో ఉండదు. నేరుగా థియేటర్లో ఈ పాట విని జనాలు థ్రిల్ అయ్యారు. రాయలసీమ మాండలికంలో చాలా చక్కటి పాట రాశాడు గోదావరి జిల్లా వాడైన చైతన్య ప్రసాద్. ఈ పాటకు సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు చైతన్యప్రసాద్.
‘‘రాజమౌళితో తొలిసారి పని చేసింది ‘మర్యాద రామన్న’కే. అందులో ‘రాయె.. రాయె.. సలోని’ పాట రాశాను. ఐతే ఆడియో విడుదలకు ముందు ఓ రోజు కీరవాణి గారు ఫోన్ చేసి ప్రసాద్ లాబ్ కు రమ్మన్నారు. కొన్ని విజువల్స్ చూపించి ఒక ట్యూన్ వినిపించి బిట్ సాంగ్ రాయమన్నారు. ఆ పాట వింటుంటే ఏదో ఘోరం జరగబోతుందన్న భావన కలగాలని చెప్పారు. పాట సూటిగా ఉండకూడదని.. పూర్తిగా రాయలసీమ మాండలికంలో రాయాలని చెప్పారు. నాదే జిల్లా అని అడిగితే.. గోదావరి అని చెప్పాను. రాయలసీమ మాండలికంలో రాయగలవా అని అడిగారు. కొందరు రాయలసీమ మిత్రులున్నారని.. వారి సాయంతో రాస్తానని చెప్పాను. రాయలసీమ మాండలికానికి సంబంధించిన కొన్ని పుస్తకాలిచ్చారు. ప్రసాద్ ల్యాబ్ లో నాకో గది ఇచ్చారు. సకల మర్యాదలూ చేశారు. కానీ పాటలో ఒక్క లైన్ కూడా తట్టేలేదు. పుస్తకాల వల్ల ఏ ప్రయోజనం లేకపోయింది.
దీంతో రాయదలుచుకున్నదేదో రాసేసి.. రాయలసీమ మాండలికంలోకి మారుద్దామనుకుని.. ‘‘ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే.. వాకిండ్లకు మావాకులు గుచ్చె...’ అని రాసి కీరవాణికి.. రాజమౌళికి చూపించారు. ఇద్దరూ ఓకే అన్నారు. కానీ మూడో లైన్ మాత్రం ఎంతకీ రాలేదు. ఆ రాత్రంతా కూర్చుని దాదాపు యాభై లైన్లు రాసి రాజమౌళికి ఇస్తే.. అన్నింటినీ పరిశీలించి.. ‘లైను దొరికేసింది పెద్దన్నా’ అని కీరవాణికి చూపించారు. ఆ లైనే ‘అమ్మోరికి ఆకలి గురుతొచ్చే..’ ఇక ఆ తర్వాత చకచకా బిట్ సాంగ్ పూర్తి చేసేశాను.
తర్వాత కొన్ని రోజులకు కీరవాణి గారు ఫోన్ చేసి.. ఈ పాటకు కొనసాగింపు కావాలన్నారు. ‘అమ్మోరికి అవ్వాలని మేత... ఏనాడో రాసేసిన రాత... వెలుగుండదు రేతిరి గడిసాకా... ’ అంటూ రాశాను. అది సినిమా క్లైమాక్స్ లో వస్తుంది. ఈ పాటలో కోబలి అంటే ఏంటి అని కీరవాణి గారు అడిగారు. రాయలసీమలో అది వాడుక పదం అని.. ‘ఆది’ సినిమాలో కూడా ఓ చోట వస్తుందని చెప్పాను. మొత్తానికి బిట్ సాంగ్ అనుకున్నది కాస్తా.. పూర్తి పాటైంది. ఈ పాట ఆడియోలో లేకపోయినా.. చాలా పాపులరైంది. రింగ్ టోన్ గా కూడా మారింది. అది ఎలా సాధ్యమైందో అనుకున్నా.. సినిమా సీడీలోంచి కట్ చేసి జనాలు వాడుకుంటున్నారని అర్థమైంది. ‘మర్యాద రామన్న’ స్టోరీ రైటర్ కాంచి గారు ఈ పాట విని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు. ‘చివర్లో వచ్చి ముందున్న పాటలన్నింటినీ కొట్టి పడేశారుగా...’ అన్నారాయన’’ అని చైతన్య ప్రసాద్ వివరించారు.