నాగచైతన్య చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంటాడుగానీ, బైక్ లను .. కార్లను ఆయన చాలా ఫాస్టుగా డ్రైవ్ చేస్తుంటాడు. అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత రేసర్ గా ఆయన తన వేగాన్ని తగ్గించాడుగానీ, వాటిపై ఆ ఇష్టం మాత్రం అంతే ఉంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన బైక్ లను .. కార్లను ఆయన ఒక చూపు చూస్తుంటాడు. వాటిపై ఆయనకి మంచి అవగాహన ఉండటం వలన, ఆయా మోడల్ కార్లను లాంచ్ చేసే వేడుకల్లో ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఇక సినిమాల్లోను బైక్ లకు .. కార్లకు సంబంధించిన సన్నివేశాల్లో పాల్గొనడం తనకి మరింత ఇష్టంగా ఉంటుందని చైతూ చెప్పాడు.
గతంలో ఆయన ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసి, మళ్లీ దానిని తన టేస్టుకు తగినట్టుగా రీ మోడల్ చేయించినట్టుగా వార్తలు వచ్చాయి. తాజా ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా, చైతూ ఇలా స్పందించాడు. "ఒకసారి నా బర్త్ డేకి నాన్న ఒక కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ కారును నాకు నచ్చినట్టుగా మార్చుకున్నాను. జపాన్ నుంచి కొన్ని పార్ట్స్ తెప్పించి నాకు కావలసినట్టుగా చేయించుకున్నాను. కార్లు .. బైకులు .. ఆ ప్రపంచమంటే నాకు ఇష్టం. సినిమాల తరువాత నేను ఎక్కువగా ఇష్టపడేది వాటినే. నాకు ఏ మాత్రం తీరిక దొరికినా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బైకులను .. కార్లను గురించి స్టడీ చేస్తుంటాను" అని చెప్పుకొచ్చాడు.
ఇక నాగార్జున మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు బైక్స్ ఇష్టం. అందుకు ముందు సైకిల్ పై కూడా తిరిగాను. కాలేజ్ కి వెళ్లివచ్చింది సైకిల్ పైనే. ఇప్పుడంటే అందరూ సైకిళ్లు మానేశారు గానీ, అప్పట్లో అంతా సైకిళ్లు ఉపయోగించేవారు" అని అన్నారు. ఇక ఇద్దరి కాంబినేషన్లో సంక్రాంతికి వచ్చిన 'బంగార్రాజు' రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం నాగ్ సినిమా 'ది ఘోస్ట్' సెట్స్ పై ఉంటే, చైతూ 'థ్యాంక్యూ' సెట్స్ పై ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.