అక్కినేని యువహీరో నాగచైతన్య ఒక్కో హిట్టు కొడుతూ స్టార్ డమ్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సతీమణి సమంతతో కలిసి మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లో నటించాడు. ఆ తర్వాత కొంత టైమ్ తీస్కుని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి చేస్తున్నాడు.
ఈ మూవీకి మునుపెన్నడూ లేని క్రేజు నెలకొంది. చూస్తుంటే దాదాపు 40 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసేస్తోందన్న గుసగుసా ట్రేడ్ లో వినిపిస్తోంది. నాన్ థియేట్రికల్ మినహాయిస్తే ఇంత పెద్ద బిజినెస్ అంటే చైతూ రేంజు అమాంతం పెరిగిందనే అర్థం.
ఇంతకుముందు అతడి రేంజు 26 కోట్ల వరకూ ఉండేది. కానీ కమ్ముల- సాయి పల్లవి కలయికతో చైతూకి పెద్ద ప్లస్ అవుతోందని విశ్లేషిస్తున్నారు. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తో ఆ ఇద్దరి పేర్లు మార్మోగాయి కాబట్టి అది చైతూ లవ్ స్టోరికి పెద్దగా కలిసొచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆంధ్రా హక్కులు 15 కోట్లకు పలికితే.. నైజాంలో ఓన్ రిలీజ్ చేస్తున్నారు. విదేశాల్లో 6కోట్ల మేర బిజినెస్ సాగింది. నైజాంలో అమ్మేసినా 20కోట్లు పలికేదేనని అంచనా వేస్తున్నారు. అంటే నాగచైతన్య రేంజు కూడా 40 కోట్లు దాటినట్టేనని దీనర్థం. దీనిని బట్టి లవ్ స్టోరి రిలీజై 50 కోట్ల షేర్ మార్కును అందుకోవాల్సి ఉంటుంది. అంటే ఉప్పెన అంత బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సి ఉంటుంది.
ఇప్పటికే లవ్ స్టోరి పోస్టర్లు.. పాటలు క్రేజును తెచ్చాయి. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్సులు నటన ... కమ్ముల సెన్సిబిలిటీస్ ఈ మూవీకి పెద్ద ప్లస్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. అన్నట్టు సినిమా బంపర్ హిట్టు కొడితే ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళుతుంది? అన్నదానిపైనా డిబేట్ జరుగుతోంది. చైతన్య కంటే సాయి పల్లవి -కమ్ములకే ఆ క్రెడిట్ వెళుతుందా? అంటే హిట్టొచ్చాక హీరో పేరు కూడా మార్మోగుతుందని ఇంతకుముందు మజిలీకి అలానే చైతూ పేరు మార్మోగిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఏషియన్ నారంగ్ దాస్ తో కలిసి అమిగోస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.