చంద్రశేఖర్ యేలేటి సినిమాలకు టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. భారీ కాస్టింగ్ లేకపోయినా కంటెంట్ తోనే సినిమాకి హైప్ తీసుకొచ్చేయగల ట్యాలెంట్ ఈయనది. ఈయన ప్రతిభకు లేటెస్ట్ గా మనమంతా ఓ సాక్ష్యంగా కనిపిస్తుంది కానీ.. ఆ చిత్రానికి రివ్యూలు- ప్రశంసలు బాగా దక్కినా డబ్బులు వసూళ్లు మాత్రం చెప్పుకోదగ్గంతగా రాలేదు. అలాగని యేలేటికి వచ్చిన ఇబ్బందేం లేదు.
ఈ దర్శకుడికి రీసెంట్ గా ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. నాగార్జున స్వయంగా ఫోన్ చేసి మరీ ఓ సినిమాని తీయమని అడిగారట. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తనే స్వయంగా నిర్మిస్తానని కూడా చెప్పారట నాగ్. దీంతో ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులను యేలేటి చేసేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. యేలేటి రాస్తున్న స్క్రిప్ట్ ఎవరికోసం అనేదే అసలు పాయింట్. ఇప్పటివరకూ కుర్రహీరోలకు సెట్ అయ్యే సినిమాలను తీసిన యేలేటి.. రీసెంట్ గా సీనియర్ హీరోకు సరిపోయే సబ్జెక్ట్ డీల్ చేశారు. అందుకే ఇప్పుడు రాస్తున్న సబ్జెక్ట్ నాగార్జున కోసమో.. అఖిల్ కోసమో అర్ధం కావడం లేదని అంటున్నారు.
ఐతే.. చంద్రశేఖర్ యేలేటి యాక్షన్ ఎంటర్టెయినర్ స్క్రిప్ట్ రాస్తున్నారనే టాక్ ఉంది. ఒక వేళ ఇదే నిజమయితే మాత్రం .. యేలేటి స్క్రిప్ట్ రాసేది అఖిల్ కోసమే అని ఫిక్స్ అయిపోవచ్చు. నిజంగానే ఏలేటి వంటి డైరక్టర్లతో అఖిల్ తన కెరియర్ తొలినాళ్లలో సినిమాలు చేస్తే మాత్రం.. నటుడిగా మెట్యూరిటీ లెవెల్ విపరీతంగా పెరిగే ఛాన్సుంటుంది.