OTT కోసం చ‌ర‌ణ్ కొత్త అవ‌తారం

Update: 2021-09-17 06:30 GMT
మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` నిర్మాణ ప‌నుల్లో బిజీగా వున్నారు. ఈ మూవీతో పాటు రామ్‌ చరణ్ తండ్రి మెగాస్టార్‌ తో క‌లిసి `ఆచార్య`లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ శరవేగంగా జ‌రుగుతోంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. తొలిసారి చ‌ర‌ణ్‌- చిరు క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీస్‌ తో పాటు రామ్‌ చ‌ర‌ణ్ ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ తో క‌లిసి ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. తాజాగా ఈ మూవీని లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. అక్టోబ‌ర్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా వుంటే ఓటీటీ దిగ్గ‌జం డిస్నీప్ల‌స్‌ హాట్ స్టార్ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేయ‌డానికి రామ్‌చ‌ర‌ణ్‌ ని రంగంలోకి దింపాల‌ని భావిస్తోంది. ఇందు కోసం ఆయ‌న‌తో తాజాగా ఒప్పందాన్ని కూడా చేసుకున్న‌ట్టుగా తెలిసింది.

డిస్నీప్ల‌స్‌ హాట్‌ స్టార్ తన కార్యకలాపాలను తెలుగు భాషలో మరింత ఉదృతం చేయాలని యోచిస్తోంది. చాలా మంది వీక్షకులను ఆకర్షించడంలో భాగంగా రామ్ చరణ్‌ ని బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా ఎంచుకుని అత‌నితో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. తాజా స‌మాచారం ప్రకారం రామ్ చరణ్ బ్రాండ్ ఎండార్స్‌ మెంట్‌ లో భాగంగా మెజీషియ‌న్‌ గా డీస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌ కి సంబంధించిన ప్ర‌చార చిత్రంలో క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది. ఈ ప్రకటనకు సంబంధించిన‌ చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

దక్షిణాదికి చెందిన నటుడు స్ట్రీమింగ్ సర్వీస్‌ ని ఆమోదించడం ఇదే మొదటిసారి. ఇటీవల షారూఖ్ అదే సంస్థ‌ కోసం ఒక వీడియోలో న‌టించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్ప‌డు అదే త‌ర‌హాలో రామ్‌ చ‌ర‌ణ్‌ తో స‌రికొత్త ప్ర‌క‌ట‌న‌ని రూపొందించారు. ఇది ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News