దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా కాలం తర్వాత పెళ్లిసందD అనే సినిమాతో రాబోతున్నారు. పాతికేళ క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాను ఇప్పుడు పెళ్లిసందD అనే టైటిల్ తో మరో సినిమాను తీసి గుర్తు చేస్తున్నారు. రాఘవేంద్ర రావు అంటే ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులతో సినిమాలు చేసిన వ్యక్తి. అలాంటి రాఘవేంద్ర రావు నటుడిగా పెళ్లిసందD సినిమాతో పరిచయం అవ్వబోతున్నాడు. అదే విధంగా ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అందుకే దర్శకేంద్రుడు ఆహ్వానించిన వెంటనే చిరంజీవి మరియు వెంకటేష్ లు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హాజరు అయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించారు.
చిరంజీవిని రాఘవేంద్ర రావు బాబాయి అంటూ పిలుచుకుంటూ ఉంటాడు. అలాంటి రాఘవేంద్ర రావు నాకు ఎన్నో సూపర్ హిట్ లను అందించారు. అలాంటి ఒక దర్శకుడితో వర్క్ చేయకుంటే అప్పట్లో మేము ఒక వెలితిగా భావించేవాళ్లం. సినిమాల్లో ప్లాప్ లు పడ్డప్పుడు లేదా వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను ఆయన్ను కొద్ది సమయం కలిసి మాట్లాడేవాడిని అన్నాడు. రాఘవేంద్ర రావు హీరోలను చూసుకునే విధానం ఇండస్ట్రీలో మరెవ్వరు కూడా అలా చూసుకోరు. స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా ప్రతి ఒక్కరిని కూడా ఆయన చాలా లాలిస్తూ తనకు కావాల్సింది చేయించుకుంటాడు. హీరోలకు ఆయన అందుకే అభిమాన దర్శకుడు అవుతాడు అంటూ చిరంజీవి పేర్కొన్నారు.
నాకు సురేఖ కు పెళ్లి అయిన కొత్తలో ఒక సినిమా షూటింగ్ ను ముగించుకుని ట్రైన్ లో చెన్నై బయలుజేరాము. ఆ సమయంలో సురేఖ కూడా నాతోనే ఉంది. ఆ ట్రైన్ లో దర్శకుడు రాఘవేంద్ర రావు గారు తో పాటు చిత్ర యూనిట్ సభ్యులం అందరం కలిసి చెన్నై వెళ్తున్నాం. అందరితో పాటు ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ బోగీలో కూర్చుని వెళ్లవచ్చు అనుకుంటూ ఉన్నాను. కాని మా ఇద్దరి కొసం ఒక స్పెషల్ కంపార్ట్ మెంట్ ను చూపించారు. అందులోకి వెళ్లి చూడగానే ఫస్ట్ నైట్ సెటప్. ఎప్పుడు ఇదంతా చేయించారు అంటూ నేను ఆశ్చర్యపోయాను. స్వీట్లు.. పండ్లు పూలు అవన్ని చూసి సురేఖ సిగ్గుతో చచ్చిపోయిందని చిరంజీవి సరదాగా అప్పటి ముచ్చట్లను షేర్ చేసుకున్నారు. రాఘవేంద్ర రావు అంటే రొమాంటిక్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. చిరంజీవి చెప్పిన ఈ రియల్ లైఫ్ సంఘటన ఆయన ఎంతటి రొమాంటిక్ అనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.