ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి.. మరొకరెమో యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసిన యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.. ఈ ఇద్దరిలోనూ ఒక పోలిక ఉంది. ఇద్దరూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు.. అర్జున్ రెడ్డితో విజయ్ మేనియా మాములుగా లేదు.. ఇప్పుడు ఈ స్టార్ లిద్దరూ ఒకే వేదికను పంచుకోబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. అదే జరిగితే చిరు ఏం మాట్లాడుతారు.? విజయ్ ఎలా స్పందిస్తారనేది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
సెన్షేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు ఊహించని సర్ ప్రైజ్ వచ్చింది. ఆయన నటించిన ‘గీతాగోవిందం’ ఈనెల 15న రిలీజ్ కు సిద్ధమవుతోంది. రష్మీక మందానతో కలిసి విజయ్ చేసి రోమాంటిక్ మూవీకి ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చింది. విడుదలైన ట్రైలర్లు - టీజర్లు - ఫస్ట్ లుక్ లు యూత్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. పరుశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా తీస్తున్నారు.
ఇప్పటికే ‘గీతా గోవిందం’ మూవీ ఆడియో వేడుకకు అల్లు అర్జున్ వచ్చి క్రేజ్ ను పెంచారు. ఇప్పుడు 12న ప్రీ రిలీజ్ వేడుకను విశాఖపట్నంలో నిర్వహించేందుకు చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు సమాచారం. బావమరిది అల్లు అరవింద్ కోరిక మేరకు చిరు ఈ ఫంక్షన్ కు వస్తున్నట్టు టాలీవుడ్ నుంచి వార్తలొస్తున్నాయి. ఈ వార్త తెలిసి విజయ్ దేవరకొండ ఫుల్ ఎక్సైట్ అయ్యాడని తెలిసింది. అయితే చిరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తున్నట్టు అధికారికంగా అల్లు అరవింద్ , గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.