పేద‌ అభిమాని కుమార్తె పెళ్ళికి చిరు సాయం

Update: 2020-12-10 10:42 GMT
ఓవైపు రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో త‌న సోద‌రుని కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లికి హాజ‌రైన మెగాస్టార్ .. మ‌రోవైపు ఓ పేద అభిమాని కుమార్తె పెళ్లికి ఆర్థిక‌ సాయం చేయడం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే..

మహబూబాబాద్ పట్టణానికి కి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి తో జీవనాన్ని సాగిస్తూ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా ఉన్నారు. చిరంజీవి సేవా కార్యక్రమాల్లోనూ ఆయ‌న పాల్గొంటున్నారు. శేఖర్ కీ ఇద్దరు కూతుళ్ళు వర్ష.. నిఖిత. వీళ్ళ పేదరికాన్ని స్వయంగా చిరంజీవి తెలుసుకొని పెద్దమ్మాయి వర్ష (ఈ నెల డిసెంబర్ 19) పెళ్లికి 1ల‌క్ష ఆర్ధిక సాయం అంద‌చేశారు.

అభిమానులు కష్టాల్లో ఆదుకోవ‌డం మెగా హీరోల‌కు కొత్తేమీ కాదు. మెగాస్టార్ ప‌లు సంద‌ర్భాల్లో విరివిగా విరాళాలిచ్చారు. గ‌తంలో కొంద‌రు అభిమానుల‌కు ఆస్ప‌త్రి ఖ‌ర్చుల‌కు సాయం చేశారు. ఇటీవ‌ల సీసీసీ స‌రుకుల పంపిణీ పేరుతో వేలాది సినీకార్మికుల‌కు క్రైసిస్ కాలంలో ఆదుకునే ప్ర‌య‌త్నం చేసారు. చిరంజీవి స్ఫూర్తిగా అభిమానులు ఇలాంటి సేవాకార్య‌క్ర‌మాలు చేసేందుకు ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. మెగా హీరోల బ‌ర్త్ డేల‌కు అభిమానులు ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హిస్తున్నారు.
Tags:    

Similar News