సైరా..ఇది నిజమేనా?

Update: 2018-05-08 06:40 GMT
మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా షూటింగ్ వేగాన్ని పెంచుతున్నాడు. పక్కా ప్లాన్ గా అంత సవ్యంగా జరుగుతోందని సమాచారం అందుతోంది. అలాగే రిలీజ్ డేట్ కూడా నిర్మాత రామ్ చరణ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఈ సమయానికి విడుదల కార్యక్రమాలు మొదలవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి కలిసొచ్చిన మే 9న సైరా సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ వర్క్ చాలా పెండింగ్ లో ఉంది. పైగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత గల సినిమా కావడంతో ఆ పనులకే సమయం ఎక్కువ పడుతుంది. మరి ఆ డేట్ ఎంత వరకు నిజమో తెలియదు కాని మెగాస్టార్ జగదేక వీరుడు అతిలోక సుందరి - గ్యాంగ్ లీడర్ వంటి ఇండస్ట్రీ హిట్స్ మే 9న రిలీజ్ అయ్యాయి కాబట్టి సైరా కూడా వచ్చే ఏడాది అదే తేదీన రావాలని డిసైడ్ అయ్యారు.

అయితే సైరా షూటింగ్ లో ఏ మాత్రం ఆలస్యం అయినా మళ్లీ సినిమా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడుతుంది. చేంజ్ చేయక తప్పదు. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారమే వెళితే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు స్పెషల్ యాక్షన్ సీన్స్ అన్ని కరెక్ట్ సమయానికి అయిపోతాయట. ఆలస్యం కాకూడదు అని ఎప్పటికప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి గ్రాఫిక్స్ టీమ్ తో సీన్ బై సీన్ వర్క్ ఫినిష్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టీమ్ వేసుకున్న ప్రణాళికల ప్రకారం సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News