స్నేహ ఉల్లాల్ ను గేల్ అలా ఫ్లాట్ చేశాడా?

Update: 2016-03-20 08:48 GMT
క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు ఆటను ఎంతగా అస్వాదిస్తాడో.. అమ్మాయిల్ని అంతేలా ఆరాధించటంతో.. వారితో కలిసి ఎంజాయ్ చేయటం గేల్ కి మామూలే. అతగాడి అమ్మాయిల పిచ్చి ఎంతుందో.. ప్రాశ్చాత్య మీడియాకు బాగానే తెలుసు. అంతదాకా ఎందుకు.. గేల్ ను అభిమానించే అందరికి సుపరిచితం. కంటికి నదురుగా కనిపించే ఏ అమ్మాయిని వదలని ఈ క్రికెటర్..తాజాగా బాలీవుడ్ భామ స్నేహా ఉల్లాల్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

ఆ మధ్యన గేల్ తో దిగిన ఫోటోల్ని స్నేహా ఉల్లాల్ బయట పెట్టుకోవటమే కాదు..అతడి గురించి కోతలు కోసేస్తుంది. గేల్ లాంటి ఆటగాడు తన దగ్గరకి వచ్చి పొగిడేయటం ఆమెను నేల మీద ఉండనీయకుండా చేస్తోంది. గేల్ తో తన ఫ్రెండ్ షిప్ గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఈ భామ.. తమ పరిచయం ఎలా జరిగిందో ఓపెన్ అయ్యింది.

ఓ ప్రైవేట్ పార్టీలో తామిద్దరం కలిసామని.. అతను తన దగ్గరకే వచ్చి మాట్లాడాడని.. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు మాట్లాడుకోవటం జరుగుతుందని చెప్పుకొచ్చింది. గేల్ తనను పొగుడుతున్న తీరును చెప్పుకుంటూ అతగాడి కాంప్లిమెంట్స్ కి ఫిధా అయినట్లు కనిపిస్తోంది. మనిషి రూపంలో ఉన్న బొమ్మగా తనను పొగిడేస్తాడంటూ మురిసిపోతుంది.

బాలీవుడ్ అంటే అతడికున్న అభిమానం నుంచి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పిన ఉల్లాల్.. అమితాబ్ అంటే ప్రాణాలు ఇచ్చేందుకు సైతం సిద్ధమయ్యేంత ఫ్యాన్ గా చెప్పుకొచ్చింది. స్నేహా ఉల్లాల్ మాటల్ని చూస్తే.. గేల్ తన రసిక కళను స్నేహా ఉల్లాల్ మీద ప్రయోగిస్తున్నట్లుగా చెబుతున్నారు. అతగాడి యవ్వారం చూస్తుంటే.. స్నేహతో బాలీవుడ్ లో కాలుపెట్టి.. ఎంతోమంది భామల మీద ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహా ఉల్లాల్ దగ్గర ఉడికినంత ఈజీగా గేల్ పప్పులు మిగిలిన బాలీవుడ్ భామల వద్ద ఉడుకుతాయా? ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tags:    

Similar News