బాలీవుడ్ లో ఎన్నడు లేని విధంగా కొన్ని అల్లర్లు చెలరేగుతున్నాయి. అక్కడి సినీ ఉద్యోగులు, కార్మికులు రోజువారీ వేతనాలని పెంచేవారకు సినిమా షూటింగ్స్ ని నిర్వహించవద్దని సినిమా షూటింగ్స్ ని అడ్డుకుంటున్నారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ సినీ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ధర్నాను కొనసాగిస్తున్నారు చాలా మంది.
రీసెంట్ గా అమితాబ్ మరియు షారుక్ వంటి వారి సినిమా షూటింగ్స్ ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే దీపికా పదుకొనె నటిస్తున్న బాలీవుడ్ సినిమాలతో పాటు చిన్న తరహా సీరియల్స్ పై కూడా ధర్నాలకు దిగుతున్నారు. సినిమాకు పని చేసే వాళ్ళకి డైలీ పేమెంట్స్ పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ సినీ ఎంప్లాయిస్ సంస్థ అధ్యక్షుడు తివారి డిమాండ్ చేశారు. ఏది ఏమైనా సరే ప్రస్తుత రోజుల్లో ఉన్న నిర్మాతలు రోజువారీ వేతనాలను పెంచి సినీ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం బాలీవుడ్ సినిమా షూటింగ్స్ కి ఈ ధర్నాలు అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో కొందరు నిర్మాతలు పోలీసుల సంరక్షణలో షూటింగ్స్ జరుపుకుంటున్నారు. అలాగే కొన్ని సీరియల్స్ ఆగిపోగా మరి కొంతమంది షూటింగ్స్ లొకేషన్స్ ని ఇతర రాష్ట్రాలకు షిఫ్ట్ చేసుకుంటున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అక్కడి నిర్మాతల మండలి ఈ ధర్నాపై త్వరలోనే సమీక్ష జరపనుందని తెలుస్తోంది.