సూర్య క్రేజీ మూవీ రిలీజ్ పై క్లారిటీ

Update: 2022-02-01 10:45 GMT
తమిళ స్టార్‌ నటుడు సూర్య బ్యాక్ టు బ్యాక్‌ ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్ సినిమాలతో సక్సెస్ దక్కించుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌ గా మంచి హిట్‌ అవ్వడంతో పాటు సూర్యకు నటుడిగా మంచి పేరును తెచ్చి పెట్టాయి. దాంతో సూర్య తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా సూర్య హీరోగా రూపొందిన ఈటీ - ఎతర్‌క్కుమ్‌ తునిందవన్ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా కరోనా వరుస వేవ్‌ ల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా ను ఓటీటీ లో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అది కాకుండా అతి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా కూడా పోస్టర్‌ విడుదల చేయడం ద్వారా తెలియజేశారు.

ప్రముక దర్శకుడు పాండిరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా ను తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సన్‌ పిక్చర్స్ వారు నిర్మించారు. సూర్య కు జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా ఉంటాయంటూ ఫిల్మ్‌ మేకర్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. హీరో సూర్య ను ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో చూడబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

హీరోగా సూర్య కు ఇది మరో మంచి కమర్షియల్‌ హిట్‌ చిత్రంగా నిలవడమే కాకుండా ఆయన నటన ప్రతిభకు నిదర్శణం అన్నట్లుగా నిలుస్తుందని యూనిట్‌ సభ్యులు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా ను సరైన సమయంలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారికంగా అయితే విడుదల తేదీ రాలేదు.. కాని తమిళ మీడియా వర్గాల వారు మరియు సినీ వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను మార్చి 10వ తారీకు లేదా 11వ తారీకున విడుదల చేయబోతున్నారు. తమిళంలోనే కాకుండా ఈ సినిమా ను సౌత్‌ లో అన్ని భాషల్లో మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్‌ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌ గా సూర్య పేరు దక్కించుకున్నాడు. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ పక్కా ప్లానింగ్‌ తో మార్చి రెండవ వారంలో ఆ తేదీలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సౌత్‌ లో కాని నార్త్‌ లో కాని ఆ తేదీల్లో పెద్ద సినిమాలు లేవు. కనుక అదే సేప్‌ డేట్‌ అవుతుందని అంటున్నారు. పరీక్షల సీజన్‌ అయినా కూడా పర్వాలేదు అనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట. అదే తేదీని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News