తాగటం తప్పు కాదు. తాగి వాహనాన్ని నడపటమే తప్పంతా. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరంలో బుక్ అయిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నా ఈ జోరు మాత్రం తగ్గటం లేదు. ఫుల్ గా తాగేసి నిర్లక్ష్యంగా వాహనాల్నినడిపేయటం.. ప్రమాదాలకు కారణం కావటం ఎక్కువైంది. ఇలాంటి తప్పులకు చెక్ చెప్పేందుకు పోలీసులు తరచూ తనిఖీలు చేస్తుంటారు.
ఈ తనిఖీల్లో పలువురు ప్రముఖులు.. సెలబ్రిటీలు దొరికిపోయి పరువు పోగొట్టుకోవటం తెలిసిందే. అయినప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పుల్ని చేస్తూ బుక్ అవుతున్నారు.తాజాగా ఆ జాబితాలో చేరారు యువ కమేడియన్ నవీన్ (కుమారి 21ఎఫ్ పేం) తప్పతాగి కారు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. తాగి వాహనాన్ని నడుపుతున్న అతగాడు.. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలు.. వారి పక్కనే ఉన్న మీడియాను చూసి భయపడిపోయాడు. కారు కిందకు నక్కి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. మీడియా కెమేరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యాడు.
ఫుల్ గా తాగినట్లుగా గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి..కారును సీజ్ చేశారు. నవీన్ తో పాటు ఫుల్ గా పబ్బుల్లో మందుకొట్టి కారు నడుపుతున్న పలువురు యువతీయువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా 14 కార్లు.. ఆరు టూవీలర్స్ ను సీజ్ చేశారు. పోలీసులు.. మీడియా అంటే అంత భయం ఉన్నప్పుడు ఫుల్ గా తాగేసి కారు నడపటం ఎందుకు.. ఎవరో ఒక సహాయకుడ్ని డ్రైవర్ గా పెట్టుకుంటే సరిపోతుంది కదా?
Full View