ఎన్నిక‌ల్లో తెలుగోడిని తొక్కేసే కుట్ర‌?

Update: 2019-06-20 05:10 GMT
తెలుగువాడైన విశాల్ పై త‌మిళ తంబీలు కుట్ర చేశారా? ప‌్రాంతీయ‌త‌ను రెచ్చ‌గొట్టి న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల్లో ఓడించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే అవున‌నే తాజా ప‌రిణామం చెబుతోంది. న‌డిగ‌ర సంఘం కార్య‌ద‌ర్శిగా.. నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా విశాల్ తంబీల‌కు పెను స‌వాల్ గా మార‌డంతో .. అత‌డిపై తంబీలంతా ఏక‌మై కుట్ర చేశార‌ని తాజా స‌న్నివేశాలు వెల్ల‌డిస్తున్నాయి. త్వ‌ర‌లో న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లకు న‌గారా మోగిన సంద‌ర్భంగా నాజర్ - విశాల్ ప్యాన‌ల్ పై భాగ్యరాజ్‌-ఈశ్వరి గణేషన్ ప్యానెల్ విషం చిమ్ముతోంది. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా తంబీల‌పై తెలుగువాడైన విశాల్ పెత్త‌నాన్ని నిల‌దీస్తోంది. ఆ మేర‌కు భాగ్య‌రాజా ప్ర‌తిసారీ త‌న స్పీచ్ ల‌లో విశాల్ ప్రాంతీయ‌త‌ను నిల‌దీసే ప్ర‌య‌త్నం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇరు ప్యానెల్స్ మ‌ధ్యా వార్ ఆఫ్ ది యారోస్ వేడెక్కిస్తున్నాయి. విశాల్ వ‌ర్సెస్ భాగ్యరాజ్‌! వార్ న‌డుస్తోంది. ఇరువ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు విరుచుకుప‌డుతున్నారు. ఇక‌పోతే వీట‌న్నిటికీ అతీతంగా విశాల్ కి ఎదురైన ఓ ప్ర‌తికూల ప‌రిణామం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. ఈనెల 23న న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా వాటిని వాయిదా వేస్తూ తమిళనాడు రిజిస్టర్ అఫ్ సొసైటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

న‌డిగ‌ర సంఘం బ‌హిష్క‌రించిన 61 మంది స‌భ్యులు స‌చ్చీలురు అని నిరూపించుకున్నాకే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఆంక్ష‌లు విధించ‌డంతో ఇది విశాల్ కి దెబ్బ ప‌డే ప‌రిణామ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఆ 61 మందిలో మెజారిటీ స‌పోర్ట్ విశాల్ కే ఉండ‌డంతో అది ప్ర‌తికూల‌త‌కు తావిస్తోంది. ఇక ప‌దే ప‌దే తంబీలపై తెలుగోడి పెత్త‌న‌మేంటి? అంటూ భాగ్య‌రాజా ప్ర‌చారం హోరెత్తించ‌డం మ‌రో ప్ర‌తికూల ప‌రిణామం అని విశ్లేషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు తీసిపోనంతగా తమిళ సినీపరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు వేడి పెంచ‌డంపైనా స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. సీరియ‌స్ అట్మాస్పియ‌ర్ లో ఎన్నిక‌లు వాయిదాని విశాల్ ప్యానెల్ జీర్ణించుకోలేని స‌న్నివేశం నెల‌కొంది. తాజా పరిణామం విశాల్ విజయానికి గండికొట్టే విధంగా ఉండటంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారన్న ముచ్చ‌టా సాగుతోంది.  61మంది సభ్యుల సభ్యత్వంపై తీర్పు వెలువడిన త‌ర్వాత‌నే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ త‌ర్వాత‌నే ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తార‌న్న‌ది ప్ర‌క‌టిస్తార‌ట‌.


Tags:    

Similar News