`బాహుబలి` తొలి పార్ట్ కబుర్లే ఇంకా పూర్తిగా అయిపోలేదు. ఆ సినిమా సాధిస్తున్న వసూళ్ల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ బాహుబలిని పొగుడుతున్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ రెండో పార్ట్ కబుర్లు చెబుతున్నాడు. `బాహుబలి 2`కి సంబంధించిన డీల్ కుదిరిందనీ, ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆ చిత్రాన్ని రూః 325కోట్లకు కొనుగోలు చేసిందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. మరి అందులో నిజమెంతన్నది బాహుబలి బృందమే చెప్పాలి.
`బాహుబలి2` కోసం రాజమౌళి అండ్ టీమ్ సెప్టెంబరు నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇప్పటికే చిత్రబృందం మొత్తానికీ కబురు పెట్టాడు రాజమౌళి. ఎవరికి ఎన్ని పనులున్నా ఆ లోపుగానే పూర్తి చేసుకొని వచ్చేయాలని ఆర్డర్ చేశాడట. ఇప్పటికే సగభాగానికి పైగా ఆ సినిమాని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి దిగాలన్నది రాజమౌళి ప్లాన్. ఈసారి మరింత భారీ హంగులతో బాహుబలి 2ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ ఘన విజయం సాధించడంతో రెండో పార్ట్ గురించి కూడా వ్యాపార వర్గాలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఓ ప్రముఖ కార్పొరేట్ నిర్మాణ సంస్థ బాహుబలి 2 హక్కుల్ని టోకుగా కొనేసింని తెలుస్తోంది. ఆ విషయం గురించి త్వరలోనే బాహుబలి బృందం స్పందించే అవకాశాలున్నాయి.