3 కోట్లతో మహేష్ బాబు ఫైటింగ్
ఈ మధ్య కాలంలో అసలు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైట్లను చూడలేదు. శ్రీమంతుడు వంటి సినిమాల్లో ఫైటింగులు చేసినా కూడా అవి చాలా చిన్నవే. ఇక బ్రహ్మోత్సవంలో అలాంటివేం లేదు. కాబట్టి అభిమానులు కూడా యాక్షన్ హీరోగా పోకిరి తన దూకుడు చూపిస్తే చూడాలని వెయిట్ చేస్తున్నారు. వారందరి కోరిక తీర్చడానికి దర్శకుడు మురుగుదాస్ కాస్త గాట్టిగానే కష్టపడుతున్నాడు మరి.
ప్రస్తుతం చెన్నయ్ లోని ఒక స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్-మురుగుదాస్ సినిమా త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి రానుంది. ఈ సినిమాలోనే అత్యంత ఖరీదైన ఈ ఫైటింగ్ కమ్ చేజ్ సీన్ ను దాదాపు 3 కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్నారట. వివిధ కార్ చేజులు.. వాటి పక్కనే బోటులో మరో చేజ్.. మొత్తంగా ఒక పెద్ద ఫైటింగ్.. వాటిలో ఆసక్తిగొలిపే విజువల్ ఎఫెక్ట్స్.. అన్నీ కలుపుకుని ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చవుతుంది.
ఈ మధ్యకాలంలో మహేష్ అసలు ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్లు చేయనేలేదు. ఎప్పుడో దూకుడు, ఆగడు టైములోనే కాసినన్ని చేశాడు. చూద్దాం మరి ఈసారి మురుగుదాస్ ఎలా తీర్చిదిద్దనున్నాడో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/