హీరోలూ.. అతన్ని చూసి నేర్చుకోండి

Update: 2018-05-02 06:46 GMT
సినిమా ఈవెంట్ అంటే చాలు బోలెడంత హంగామా చేసేస్తుంటారు మన తారలు. హీరో హీరోయిన్లతో పాటు ఇతర టెక్నీషియన్స్ కూడా తమ హంగు ఆర్భాటాలను బాగానే ప్రదర్శిస్తుంటారు. రీసెంట్ గా చూసిన రంగస్థలం సక్సెస్ మీట్ మినహాయిస్తే.. ఎక్కడా స్థానికత అనే మాటే కనిపించదు.

తమిళ్ లో నేటివిటీని చూపించేందుకు తారలతో పాటు టెక్నీషియన్స్ కూడా ప్రయత్నిస్తుంటారు. పంచెలు.. లుంగీలతో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం కనిపిస్తుంది. కానీ మన దగ్గర పక్కాగా సూటు బూటు వేసుకుని అందరూ వచ్చేస్తుంటారు. రీసెంట్ గా జరిగిన మహానటి ఆడియో ఫంక్షన్ లో లీడ్ హీరోయిన్ కీర్తి సురేష్ చీరకట్టులో ఆకట్టుకుంది. సావిత్రి పాత్ర కాబట్టి.. ఆమె ఆ స్థాయిలో ఉండడంలో ఆశ్చర్యం లేదు. మిగిలిన వారిలో ఒక వ్యక్తి మినహా.. మిగిలిన వారెవరూ స్థానికత అనే అంశమే లేదు. ఆ ఒక్క వ్యక్తి కూడా భారతీయుడు కాకపోవడం మరీ ఆశ్చర్యపోయే విషయం.

మహానటి చిత్రానికి ఓ ఫారినర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. అతని పేరు డాని సాంచెజ్ లొపెజ్. ఇతను మాత్రమే పంచెను లుంగీ మాదిరిగా కట్టి.. భారతీయత ఉట్టిపడేలా మహానటి ఆడియో ఫంక్షన్ లో కనిపించాడు. స్పెయిన్.. అమెరికాలతో పాటు ఇండియన్ చిత్రాలకు కూడా పని చేసే ఈ ఫారినర్.. ఇక్కడి నేటివిటీ అలరిస్తే.. మనవాళ్లు మాత్రం స్థానికత అన్న పాయింటే తెలియనట్లు కనిపించడం ఆశ్చర్యకరం !!

Tags:    

Similar News