ఆ ప్లేస్ మరొకరికి ఇవ్వలేనంటున్న పార్తీబన్
ప్రస్తుతం నటుడిగా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న పార్తీబన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య పై ఉన్న ప్రేమను బయటపెట్టాడు.;
ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ మ్యారేజెస్ చాలా కామన్. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. ఈ మధ్య అలా విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోతున్నాయి. అప్పటివరకు కలిసున్న వాళ్లు సడెన్ గా విడిపోతున్నామని చెప్పి అందరికీ షాకిస్తున్నారు.
అలా ఎంతోమంది సెలబ్రిటీ జంటలు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. కానీ పెళ్లి చేసుకుని విడిపోయాక కూడా తన భార్యను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడు యాక్టర్, రైటర్, డైరెక్టర్ పార్తీబన్. ఆయన దర్శకత్వంలో సుమారు 16 సినిమాలొచ్చాయి. ప్రస్తుతం నటుడిగా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న పార్తీబన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య పై ఉన్న ప్రేమను బయటపెట్టాడు.
దర్శకుడిగా తన ఫస్ట్ మూవీ పుదియా పాడై సీత నటించడం వల్లే హిట్టయిందని, ఆ తర్వాత సీతను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నామని చెప్తున్న కొన్నాళ్ల తర్వాత పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయినట్టు చెప్పాడు. అప్పుడు తామిద్దరూ కలిసి ఉన్న ఇంటిని కూడా అమ్మేశామని, ఆ ఇల్లు అమ్మాక తాను ఇప్పటివరకు మరో ఇల్లు కొనుక్కోలేకపోయాయని చెప్తున్నాడు పార్తీబన్.
సీత అంటే ఇప్పటికీ తనకెంతో గౌరవమని, ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని చెప్తున్న ఆయన తన భార్యగా సీతకు స్థానమిచ్చానని, ఆ స్థానాన్ని మరొకరికి ఇవ్వలేనని అందుకే విడాకులిచ్చి సుమారు పాతికేళ్లవుతున్నా మళ్లీ పెళ్లి చేసులేదని అంటున్నాడు. అలాగని ఆమెకు టచ్ లో లేనని, తన తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్లి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించానని చెప్పుకొచ్చాడు.
1990లో పెళ్లితో ఒకటైన పార్తీబన్, సీతకు ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకుని దత్తత తీసుకున్నారు. ఆ కూతుళ్లిద్దరికీ కూడా పెళ్లిళ్లయ్యాయని పార్తీబన్ ఇంటర్వ్యూలో తెలిపాడు. 2001లో సీత, పార్తీబన్ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత పార్తీబన్ సింగిల్ గానే ఉండగా, సీత మాత్రం మరొకరని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనికి కూడా సీత విడాకులిచ్చింది.