వీరి వీరి గుమ్మ‌డిపండు.. ఎవ‌రీ పాప‌?

Update: 2019-05-18 17:01 GMT
అందం .. ప్ర‌తిభ ఉన్నా కొంద‌రికి కాలం క‌లిసి రాదు. ద‌రిద్ర దేవ‌త ఇంటి చూరు ప‌ట్టుకుని వేలాడుతుంది. ల‌క్ చిక్క‌క ఊహించ‌ని ఫ్లాపుల్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాంటి వారిని ఐరెన్ లెగ్ అని పిలిచేస్తుంటారు. అలా టాలీవుడ్ లో ప్ర‌వేశించిన ఎంద‌రో ముద్దుగుమ్మ‌లు చివ‌రికి ఒక్క హిట్టు కూడా లేక బ్యాక్ టు పెవిలియ‌న్ అంటూ మోడ‌లింగ్ కి వెళ్లిపోయిన సంద‌ర్భాలున్నాయి. కొంద‌రైతే విదేశాల్లో చ‌దువులు అనో లేక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోతున్నామ‌నో వెళ్లిపోతుంటారు. ఏవో కొన్ని సినిమాలు స‌ర‌దాకి చేశామ‌ని కూడా స‌రిపెట్టేసుకుంటారు.

అలాంటి బాప‌తు వెతికితే చాలా పెద్ద జాబితానే ఉంది. ముఖ్యంగా మిస్ ఇండియాగా.. అందాల పోటీల్లో స‌త్తా చాటి.. అటుపై  ముంబైలో టాప్ మోడ‌ల్ గా ఓ వెలుగు వెలిగిన ధీక్షా సేత్ అనూహ్యంగా టాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఆరంభ‌మే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదం చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకుంది. ఆ సినిమాలో త‌న‌దైన అందంతో క‌ట్టి ప‌డేసింది ఈ ముద్దుగుమ్మ‌. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న ఆరంభ‌మే అవ‌కాశం అందుకోవ‌డంతో ప్ర‌భాస్.. గోపిచంద్.. ర‌వితేజ లాంటి స్టార్లు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేశారు. దీంతో ఇక‌పై పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంద‌నే భావించారంతా. కానీ అచ్చులో బొమ్మ అక్క‌డే తిర‌గ‌బ‌డింది. ఈ అమ్మ‌డి కెరీర్ ఆద్యంతం ఫ్లాపులు వెన్నాడాయి. దుర‌దృష్టం వ‌దిలిపోనని మొరాయించింది. దాంతో టాలీవుడ్ లో హిట్టు అన్న‌దే లేకుండా కెరీర్ ని సాగించాల్సి వ‌చ్చింది. అటుపైనా బాలీవుడ్ .. కోలీవుడ్.. శాండ‌ల్వుడ్ లోనూ ధీక్ష‌గా ప్ర‌య‌త్నాలు సాగించింది. కానీ వెళ్లిన ప్ర‌తిచోటా ఏదో రూపంలో దుర‌దృష్ట‌మే వెంటాడింది. స‌క్సెస్ రాక‌.. పూర్తిగా కెరీర్ ప‌రంగా డీలా ప‌డిపోయింది.

కాల‌క్ర‌మంలో ధీక్ష స్వ‌స్థ‌లం ముంబైలో పూర్తిగా ప‌లు వ్యాపారాల‌తో బిజీ అయిపోయింద‌ని ప్ర‌చార‌మైంది. చాలా గ్యాప్ త‌ర్వాత ఇదిగో ఇలా మాల్దీవుల్లో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో ఒక్క‌సారిగా షాకిచ్చిందిలా. స‌మ్మ‌ర్ వెకేష‌న్ ని అమ్మ‌డు అల్లాడిస్తోంది. బ్లాక్ బికినీలో ఇంచి ఇంచి ఏమాత్రం దాచుకోకుండా వ‌డ్డ‌న‌లు చేసింది. విజువ‌ల్ ఫెస్ట్ కి ఇంత‌కంటే ఏం కావాలి? అన్నంత‌గా ట్రీటిచ్చింది మ‌రి. ఈ బికినీ ట్రీట్ చూశాక ధీక్ష‌లో ఇంకా వేడి త‌గ్గ‌లేద‌నే అర్థ‌మ‌వుతోంది. ఇలా సామాజిక మాధ్య‌మాల్లో రెగ్యుల‌ర్ గా ట‌చ్ లోకి వ‌చ్చి వ‌న్ ఫైన్ డే తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేస్తుందేమో?  ధీక్ష‌ను ఇలా చూశాక మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌న‌సు మార‌కుండా ఉంటుందంటారా?


Tags:    

Similar News