పెళ్లితో ఆలుమగలు ఒకటవ్వడమే కాదు.. ఇరు కుటుంబాల్లో అందరి మనసుల్లోకి చేరిపోవాలి. అలా జరగలేదంటే ఆ తర్వాత కల్లోలమే. ఇరు కుటుంబాల్లో ఎవరు ఎవరికి నచ్చకపోయినా దాని పరిణామాలు కొత్త జంటను తీవ్ర కల్లోలంలోకి లాక్కెళతాయి. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. అయితే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా అత్తగారింటితో తన కనెక్షన్ కి సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసాడు.
అతడు దీపికను ప్రేమించి పెళ్లాడాడు. అయితే స్వతహాగా అతడి మనస్తత్వానికి అత్తగారి మనస్త్వం సింక్ అవ్వలేదని కాఫీ విత్ కరణ్ షోలో వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. తాను బిగ్గరగా మాట్లాడతాడు. వెస్ట్రన్ స్టైల్ ఫ్యాషన్స్ తో ఎంతో వైవిధ్యంగా ఉండాలనుకుంటాడు. కానీ ఇవేవీ సాంప్రదాయ కుటుంబమైన దీపిక ఫ్యామిలీకి ఆరంభంలో అర్థం కాలేదుట. ముఖ్యంగా దీపిక తల్లిగారు రణవీర్ అత్తగారికి సింక్ కుదరలేదని కూడా తెలిపాడు. చాలా కాలం పాటు తాను అత్తగారికి కనెక్ట్ కాలేదని.. అసలు అర్థం కాలేదని కూడా వెల్లడించాడు. తనను దూరంగా ఉంచిన అంశం ఇదని కూడా తెలిపాడు.
దీపికా కుటుంబం రణవీర్ తో కలిసిపోవడానికి సమయం పట్టింది. దీపికా తల్లిదండ్రులు తనను అల్లుడిగా అంగీకరించినా కానీ.. ఎక్కువ కాలం మ్యాటర్స్ ఏవీ సాఫీగా లేవని రణవీర్ చెప్పాడు. నిజానికి రణ్ వీర్ బెంగళూరు లో అత్తారింటికి వచ్చినప్పుడు తనకంటూ ప్రత్యేకమైన డ్రెస్సింగ్ సెన్స్ ని మెయింటెయిన్ చేసేవాడట. దాని కోసం ప్రత్యేకమైన వార్డ్ రోబ్ ని ప్లాన్ చేసాడు. బెంగళూరులో ఉన్నప్పుడు తెల్లటి టీ షర్టు- నీలిరంగు జీన్స్ మాత్రమే ధరిస్తానని చెప్పాడు. నేను ఇంకా మేనేజ్ చేస్తున్నాను. స్టార్టర్స్ కోసం నా దగ్గర ఇప్పుడు రెండు వార్డ్ రోబ్ లు ఉన్నాయి... అంటూ ఫన్నీగా వెల్లడించాడు.
నేను బెంగుళూరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకమైన వార్డ్ రోబ్ లో తెల్లటి టీ షర్ట్- బ్లూ జీన్స్ ఉన్నాయి. వాటిని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు!! అని కరణ్ షోలో రణ్ వీర్ చెప్పాడు. మొదట్లో దీపిక తల్లికి తన విషయంలో ఏం చేయాలో తెలియలేదని .. అత్తగారు తనకు పూర్తిగా దూరంగా ఉండిపోయారని రణవీర్ వెల్లడించాడు. మేము ఒకరికొకరు కలిసిపోవడానికి సమయం తీసుకున్నాం. ఇప్పుడు ఆమె నా తల్లి లాంటిది`` అని రణవీర్ చెప్పాడు.
మొత్తానికి అత్తగారికి అతడు బాగానే దగ్గరైపోయాడు. పదుకొనేల సాంప్రదాయ కుటుంబంలో లౌడ్ గా కలిసిపోయాడు. ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం బెంగళూరుకు చెందిన దీపికను 2018లో ముంబై వాసి రణవీర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట తొలి సంతానాన్ని ఆశిస్తున్నారన్న గుసగుసలు ఉన్నాయి. కానీ దీపిక బేబి బంప్ గురించి ఎలాంటి సమాచారం రాలేదు. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షోలో రణవీర్ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించాడు. తనతో పాటే ఆలియా భట్ కూడా ఈ షోలో సందడి చేసింది. ఆలియా-రణబీర్ కు సంబంధించన ఎన్నో విషయాలను కూడా ఈ వేదిక బహిర్గతం చేసింది.