శోభ‌న్ బాబు పాత్ర‌లో దేవ‌ర‌కొండ‌?

Update: 2019-12-07 11:31 GMT
అమ్మ‌ జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా త‌లైవి సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏ.ఎల్.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దివంగ‌త న‌టి నాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌ పాత్ర‌లో బాలీవుడ్ న‌టి కంగ‌న న‌టిస్తోంది. ఇప్ప‌టికే సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్న వారి వివ‌రాల్ని చిత్ర‌యూనిట్ వెల్ల‌డించింది. అమ్మ లుక్ కి సంబంధించిన మోష‌న్ టీజ‌ర్ ని ఇంత‌కుముందు విడుద‌ల చేస్తే మిశ్రమ స్పంద‌న‌లు వ‌చ్చాయి. కంగ‌న‌ లుక్ పై కొన్ని విమ‌ర్శ‌లు వైర‌ల్ అయ్యాయి. నాయ‌కురాలి వేష‌ధార‌ణ‌కు కంగ‌న ఏమాత్రం స‌రిపోలేదంటూ నెటిజ‌నులు కామెంట్లు పెట్టారు. కానీ వాటిని యూనిట్ లైట్ తీసుకుని ముందుకెళ్తోంది.

ఇక జ‌య‌ల‌లిత జీవితంలో ముఖ్య‌మైన వ్య‌క్తుల్లో అల‌నాటి సొగ్గాడు శోభ‌న్ బాబు ఒక‌రు. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాలు చేసారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు ప్రేమించుకున్నార‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. అంతేకాదు జ‌య‌ల‌లిత నుంచి అంద‌గాడి ఎడ‌బాటు వెన‌క ఓ త‌మిళ‌న‌టుడి కుట్ర ఉంద‌న్న ప్ర‌చారం కూడా అప్ప‌ట్లో సాగింది.

అందుకే ఇప్పుడు శోభ‌న్ బాబు పాత్ర ఎంతో కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఆ పాత్ర‌లో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నార‌న్న‌ ప్ర‌చారం వేడెక్కిస్తోంది. జ‌య‌ల‌లిత ఇష్ట‌స‌ఖుడి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించ‌బోతున్నాడ‌ని కొత్త  ప్ర‌చారం ఇప్పుడు కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.  అయితే ఇందులో నిజం ఎంత అన్న‌ది తేలాల్సి ఉంది. ఈ చిత్రంలో క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్.. ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద స్వామి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News